Indraja And Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ని తలచుకుని లైవ్‌లో ఏడ్చేసిన ఇంద్రజ: అసలేమైంది.?
NQ Staff - August 30, 2022 / 09:33 PM IST

Indraja And Sudigali Sudheer : జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. అంతలా ఆ ప్రోగ్రామ్‌తో తన ఉనికిని చాటుకున్నాడు సుడిగాలి సుధీర్. యాంకరింగ్‌లోనూ డిఫరెంట్ పంథాని పరిచయం చేశాడు సుడిగాలి సుధీర్.
అయితే, ఇటీవలే సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అలాగే సుధీర్ యాంకరింగ్ చేస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి కూడా టాటా చెప్పేశాడు. ఎన్ని అవకాశాలొచ్చినా జబర్దస్త్‌ని వీడమంటూ చెప్పిన పలువురు ఆర్టిస్టులు ఆ షో నుంచి తప్పుకున్నారు. అలాగే సుధీర్ కూడా బయటికి వచ్చేశాడు.
అమ్మా.! అంటూ ఆప్యాయంగా..

Indraja Tears Up He Misses Sudigali Sudheer a Lot
ఆడియన్స్‌తోనే కాదు, జడ్జిలతోనూ అవినాభావ సంబంధాలున్నాయ్ సుడిగాలి సుధీర్‌కి. నాగబాబును డాడీ అని సంబోధిస్తాడు. రోజమ్మా.! అని రోజాపై అభిమానం కురిపిస్తాడు. రోజా తర్వాత ఆ ప్లేస్‌ని ఈ మధ్య మరో సీనియర్ నటి ఇంద్రజ ఆక్యుపై చేసిన సంగతి తెలిసిందే.
రోజాకి హెల్త్ ఇష్యూస్ కారణంగా తాత్కాలిక జడ్జిగా ఇంద్రజను తీసుకొచ్చారు. ఆ తర్వాత రోజా మంత్రి అవ్వడం జబర్దస్త్ నుంచి తప్పుకోవడం తదితర కారణాలతో ఆ ప్లేస్‌లో పర్మినెంట్ అయిపోయింది ఇంద్రజ. కంటెస్టెంట్స్‌తో బాగా కనెక్ట్ అయిపోయింది.
స్కిట్లలో కంటెస్టెంట్లు వేసే పంచ్ డైలాగులను అర్ధం చేసుకుని, తదనుగుణంగా నవ్వులు పూయిస్తూ అతి తక్కువ టైమ్‌లోనే ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా ఆరితేరిపోయింది. ఇక, సుడిగాలి సుధీర్‌తో ఇంద్రజకు మంచి అనుబంధం వుందని చెప్పొచ్చు. ఇంద్రజమ్మా.! అంటూ ప్రేమగా పిలుస్తాడు. ఆ పిలుపుకు బాగా కనెక్ట్ అయిపోయిన ఇంద్రజ, ఈ షో నుంచి సుధీర్ తప్పుకోవడంతో చాలా ఎమోషనల్ అయ్యింది. సుధీర్‌ని చాలా మిస్సవుతున్నానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంట తడి పెట్టుకున్నారు ఇంద్రజ.