Indraja : ఆడవాళ్లు ఇప్పుడు అలా లేరు.. సంచలన కామెంట్లు చేసిన ఇంద్రజ..!
NQ Staff - March 8, 2023 / 01:06 PM IST

Indraja : నటి ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై జోష్ నింపుతోంది. ఇప్పుడు బుల్లితెరపై జడ్జి అంటే అందరికీ టక్కున ఇంద్రజ పేరే గుర్తుకు వస్తోంది. తనదైన మాటలతో, సున్నితమైన జడ్జిమెంట్ తో అందరినీ ఆకట్టుకుంటోంది ఈమె. ఇక సమాజంలో జరిగే వాటిపై కూడా ఎప్పటికప్పుడు స్పందిసతూనే ఉంటంది ఇంద్రజ. ఆమె చేసే కామెంట్లు కూడా ఆలోచింపజేసే విధంగానే ఉంటాయి.
తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా ఓ కంపెనీ మహిళలకు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రొడక్ట్ ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది ఇంద్రజ. ఆమె మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేసింది. కొన్ని కమర్షియల్ యాడ్స్ లలో కూడా మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు.
మగవారితో సమానంగా..
సదరు యాడ్స్ లలో మహిళలు ఇంకా మగవారిపై ఆధారపడుతున్నట్టు చూపిస్తున్నారు. ఒకప్పుడు మహిలలు భర్తలపై ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు మహిళలు అలా లేరు. మగవారిపై అస్సలు ఆధారపడట్లేదు. తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. మగవారితో సమానంగా సంపాదిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు.
ఇంకొన్ని సార్లు అయితే మగవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఇప్పటి జనరేన్ లో సమస్యలను అర్థం చేసుకోమని మగవారిని బతిమాలాల్సిన అవసరం లేదు. మన సమస్యలు మనం ఓపిగ్గా భరిస్తూ పోతే.. వారే అర్థం చేసుకుంటారు. ముందు మీ గురించి మీరు ఆలోచించండి అంటూ ఆడవారికి సందేశం ఇచ్చింది ఇంద్రజ.