Indraja : సుడిగాలి సుధీర్‌తో బాండింగ్ గురించి నోరు విప్పిన ఇంద్రజ
NQ Staff - June 28, 2022 / 08:09 PM IST

Indraja : ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. మొన్నటి వరకు ఈ షోకి సుధీర్ హోస్ట్‌గా ఉండగా, ఇంద్రజ జడ్జిగా వ్యవహరించారు.షోలో వీరిద్దరి బాండింగ్ చూసి సంతోషంగా ఫీలయ్యేవారు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంద్రజ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
కీలక విషయాలు..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించి టాలీవుడ్‌ని షేక్ చేసిన ఇంద్రజ.. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీఎంట్రీ తర్వాత ఆమె ఓ వైపు సినిమాల్లో బలమైన పాత్రలు చేస్తూ, మరోవైపు టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. ప్రస్తుతం ఆమె `జబర్దస్త్` షోకి జడ్జ్ గా ఉన్నారు.
సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో అటు `జబర్దస్త్`ని, ఇటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని వదిలేశాడు సుధీర్. దీనిపై తాజాగా ఇంద్రజ స్పందించింది. ఎవరి వ్యక్తిగత విషయాలను తాను మాట్లాడనని, తన గురించి తప్ప మరెవ్వరి పర్సనల్ విషయాలను తాను చెప్పనని, తెలిసినా చెప్పనని సుధీర్ విషయంలో స్పష్టం చేసింది.
అయితే సుడిగాలి సుధీర్ షోని వదిలేస్తున్న సందర్భంగా మీరు ఎలా ఫీలవుతున్నారనే ప్రశ్నకి చాలా బాధగా అనిపిస్తుందని తెలిపింది. `జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంపై కెవ్వు కార్తీక్ ఓ స్కిట్ చేశాడు. కార్తీక్ సుధీర్‌లా కళ్ల అద్దాలు పెట్టుకునేటప్పుడు నాకు సుధీర్ గుర్తొచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఏడ్చేశాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సుధీర్‌ను నేను సిద్దూ అని పిలుస్తా. చాలా మిస్ అయ్యా. నన్ను ప్రేమగా రాజీ అని సుధీర్ పిలుస్తాడు.
అతను అమ్మ అని పిలవడం చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోవడం చాలా ఇష్టం. జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకు. చాలా మంచి అబ్బాయి. అతనికి వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చా` అని ఇంద్రజ తెలిపారు. సుధీర్, నా మధ్య తల్లి కొడుకు అనుబంధం ఉంటుందని తెలిపింది. అంతేకాదు అతనితో తన బాండింగ్ చాలా స్పెషల్ అని, అందుకే ఎమోషనల్ అయ్యానని తెలిపింది ఇంద్రజ.