Inaya Sulthana : ఇనయా కి బిగ్‌ బాస్‌ హౌస్ లో అతడిపై లవ్ అంటా..!

NQ Staff - October 6, 2022 / 08:46 AM IST

Inaya Sulthana : ఇనయా కి బిగ్‌ బాస్‌ హౌస్ లో అతడిపై లవ్ అంటా..!

Inaya Sulthana : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి వాతావరణం నెలకొంది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బర్త్‌డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ బర్త్ డే వేడుకల్లో ఇంటి సభ్యులు ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందించే ఉద్దేశంతో నానా హంగామా చేస్తున్నారు.

ఈ సమయంలో ఇనయా సుల్తానా తన లవ్ మేటర్ ని బయట పెట్టింది. కొందరు నాకు రాజ్ అంటే ఇష్టం అంటున్నారు.. కానీ సూర్య నా క్రష్, అతడు ఎందుకో నచ్చేస్తాడు అంటూ తన మనసులో మాట చెప్పేసింది.

మొదట్లో శ్రీ సత్యకు దగ్గర అవ్వాలని చూసిన అర్జున్ ఇప్పుడు కాస్త వాసంతి వైపుకు మళ్లాడు.. ఈ సమయంలోనే ఇనయా తనకు ఆర్ జె సూర్య అంటే ఇష్టం అంటూ చెప్పడంతో అంతా కూడా ఆసక్తిగా ఏం జరుగుతుందో అన్నట్లుగా చూస్తున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ వారం ఎలిమినేషన్ పై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ విభిన్నంగా జరిగింది.

జంటలుగా వెళ్లి ఒక్కరు నామినేట్ అవ్వాల్సి ఉండగా.. అందులో భాగంగా కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో నామినేషన్ అయ్యారు. కొందరు.. ఇష్టం లేకుండానే కోపంతో నామినేట్ అయ్యారు. కనుక ఎవరు ఎలిమినేట్ అయినా కూడా కచ్చితంగా ఓ రేంజ్ లో తర్వాత వారం హౌస్ అంతా వేడి వేడిగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us