Aadi: హైప‌ర్ ఆది అంత సంపాదిస్తున్నాడా.. స్కిట్‌కే ల‌క్ష రూపాయాలా!

aadi: బుల్లితెర‌పై త‌న‌దైన కామెడీ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్ టైన్ చేస్తూ వ‌స్తున్నారు హైప‌ర్ ఆది. జబర్దస్త్ లో అతను వేసే పంచులకి భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మనోడి స్కిట్లు యూట్యూబ్‌లో ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలతో కూడా హైప‌ర్ ఆది వినోదం పంచుతూ ఉంటాడు.

TheNewsQube-

 

hyper aadi  reputation topic viral
hyper aadi reputation topic viral

ఇటీవ‌ల హైప‌ర్ ఆది ద‌స‌రా స్పెష‌ల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వ‌చ్చి తెగ సంద‌డి చేశారు. వరసగా రెండో ఏడాది కూడా హైపర్ ఆదిని ఏరికోరి మరీ తీసుకొచ్చారు. స్టేజీపై కనిపించిన ప్రతీ నిమిషం అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు ఆది. పక్కనే నాగార్జున ఉన్నా కూడా అతడిని కూడా డామినేట్ చేసాడు హైపర్ ఆది.

hyper aadi  reputation topic viral
hyper aadi reputation topic viral

పోలీస్‌గా వచ్చిన ఆది.. కంటెస్టెంట్స్‌పై ఇన్వెస్టిగేషన్ అంటూ కామెడీతో పాటు సెటైర్లు కూడా వేసాడు. ముఖ్యంగా ఇవ్వాలనుకున్న వాళ్లకు హింట్స్ ఇచ్చాడు.. మరికొందరికి చురకలు కూడా అంటించాడు.. ఇంకొందరికి గేమ్ కూడా బాగా ఆడుతున్నారంటూ చెప్పుకొచ్చాడు. స్పెషల్ గెస్ట్‌గా వచ్చి రచ్చ రచ్చ చేసాడు హైపర్ ఆది.

జబర్దస్త్ లో హైప‌ర్ ఆది ఒక్కో స్కిట్ కి రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే అతన్ని ఏడాది ఆదాయం కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.. ఇక బుల్లితెరతో పాటుగా సినిమాల్లో కూడా మెరుస్తూ అలరిస్తున్నాడు ఆది.

కామెడీ షోలతో పాటుగా, సినిమాలతో కలిపి బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సొంత ఊర్లో 16 ఎకరాలు కొన్న ఆది.. హైదరాబాదులో తాజాగా ఓ ప్లాట్ తీసుకున్నట్టుగా సమాచారం. కాగా, హైప‌ర్ ఆది ఇటీవ‌ల బిగ్ బాస్ షోకి గెస్ట్ గా వ‌చ్చి 25 నిమిషాల పాటు సంద‌డి చేశాడు. దీనికోసం ఈయనకు ఏకంగా 2 లక్షల వరకు పారితోషికం అందించినట్లు తెలుస్తుంది.