Amrita Rao And RJ Anmol : కొడుకు పుట్టాక భర్తతో గొడవలొచ్చాయ్: మహేష్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.!

NQ Staff - August 27, 2022 / 04:11 PM IST

Amrita Rao And  RJ Anmol  : కొడుకు పుట్టాక భర్తతో గొడవలొచ్చాయ్: మహేష్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.!

Amrita Rao And RJ Anmol : సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతిథి’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అమృతా రావు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

అసలు విషయమేంటంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమృత రావు, తనకు కొడుకు పుట్టాక తన భర్తతో గొడవలు వచ్చాయని చెప్పింది. అంతకు ముందు పదేళ్ళు తాము హ్యాపీ గా వున్నామనీ, పెళ్ళయ్యాక తమ మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదనీ చెప్పుకొచ్చింది అమృత రావు.

కొడుకు తీసుకొచ్చిన సమస్యలు..

Husband RJ Anmol Responded to Amrita Rao words

Husband RJ Anmol Responded to Amrita Rao words

తమకు కొడుకు (పేరు వీర్) పుట్టాక ఇంట్లో సమస్యలు మొదలయ్యాయనీ, అది కూడా చిన్న చిన్న కారణాలతోననే అమృత రావు చెప్పుకొచ్చింది. అయితే, ఈ వ్యాఖ్యలపై అమృతరావు భర్త అన్మోల్ స్పందించాడు. తమ మధ్య గొడవలు జరిగిన మాట నిజమేనని చెప్పాడు.

‘అవి చిన్న చిన్న గొడవలే. అమృత రావు చాలా అభద్రతకు గురయ్యేది.. రెండో బిడ్డ విషయమై కూడా మా మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయితే, అవన్నీ ఆ తర్వాత సద్దుమణిగాయి..’ అని అన్మోల్ చెబితే, ‘ఔను.. అది నిజమే..’ అని అమృత కూడా వ్యాఖ్యానించింది.

‘పేరెంట్స్‌గా వుండడం చాలా అదృష్టం. అనేక సవాళ్ళతో కూడిన విషయం కూడా..’ అని అమృత నవ్వేసింది. అమృత రావు – ఆర్జే అన్మోల్ 2016లో పెళ్ళి చేసుకున్నారు. 2020లో వీరికి వీర్ జన్మించాడు. పెళ్ళికి ముందు దాదాపు ఏడేళ్ళు ఈ ఇద్దరూ డేటింగ్ చేశారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us