Karthikeya 2 : నిఖిల్‌కి నానా కష్టాలు.. తక్కువ స్క్రీన్స్‌లో విడుదల కానున్న కార్తికేయ 2?
NQ Staff - August 10, 2022 / 09:00 PM IST

Karthikeya 2 : సినిమా కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎంతో కొంత బ్యాక్ గ్రౌండ్ లేకపోతే రాణించడం చాలా కష్టం. వైవిధ్యమైన సినిమాల ద్వారా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న నిఖిల్ తన తాజా చిత్రం కార్తికేయ 2ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. సుమారు 17 సినిమాలు చేసిన నిఖిల్‌కి థియేటర్ల సమస్య ఏర్పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
సినిమా కష్టాలు..
నిఖిల్ హీరోగా 2014 సంవత్సరంలో రూపొందిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. అలా ప్రకటించిన దాని మేరకు కార్తికేయ సీక్వెల్ సినిమాని కూడా కరోనా సమయంలోనే మొదలు పెట్టారు.. ఇక ఎట్టకేలకు సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధం అయింది.

How many Screens Karthikeya 2 Released Topic Of Discussion
అయితే సినిమా ధియేటర్లు దొరకని నేపథ్యంలో సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.. అదే సమయానికి నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కూడా విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు వాయిదా వేసిన సినిమాని ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ బింబిసార సీతారామం సినిమాలు ముందే రిలీజ్ డేట్లు ప్రకటించడంతో ఆగస్టు మొదటి వారం వాటికి బ్లాక్ అయిపోయింది.
ఈ నేపథ్యంలో రెండో వారంలో 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే అప్పుడు కూడా సినిమాకు ఇబ్బంది ఏర్పడింది. నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో మళ్ళీ ధియేటర్ల సమస్య ఏర్పడడంతో మరో రోజు వెనక్కి వెళ్లి ఆగస్టు 13వ తేదీన విడుదలకు సిద్ధమైంది.

How many Screens Karthikeya 2 Released Topic Of Discussion
ఆ రోజున సినిమా విడుదలవుతున్నా కూడా పక్కా థియేటర్స్ సమస్య ఎదురు అవుతుందని అంటున్నారు. బింబిసార, మాచర్ల నియోజక వర్గం చిత్రాలని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయగా, ఆయన ఈ రెండు చిత్రాలకు చాలా స్క్రీన్స్ కేటాయించాడు. ఇక సీతారామం కూడా ఓ మోస్తరు స్క్రీన్స్‌లో ప్రదర్శితం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో కార్తికేయ 2 ఎన్ని స్క్రీన్స్‌లో విడుదల అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కాగా, నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదని అసలు సినిమా రిలీజ్ అవుతుందో అవ్వదో అర్థం కాని పరిస్థితుల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని కూడా బయట పెట్టాడు.