Raghava Lawrence : లారెన్స్‌కి ద‌క్కిన గౌర‌వ డాక్ట‌రేట్.. అర్హుడు అంటూ అభిమానుల ట్వీట్స్

NQ Staff - July 12, 2022 / 06:33 PM IST

Raghava Lawrence : లారెన్స్‌కి ద‌క్కిన గౌర‌వ డాక్ట‌రేట్.. అర్హుడు అంటూ అభిమానుల ట్వీట్స్

Raghava Lawrence : రాఘ‌వ లారెన్స్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు . తెలుగు .. తమిళ భాషల్లో లారెన్స్‌కి మంచి క్రేజ్ ఉంది. డాన్స్ మాస్టర్ గా .. నటుడిగా .. దర్శక నిర్మాతగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన నుంచి వచ్చిన ‘కాంచన’ .. ‘గంగ’ సినిమాలు, హారర్ కామెడీ జోనర్లో అత్యధిక వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాలు టీవీలో ఎన్నిసార్లు ప్రసారమైనా మంచి రేటింగును రాబడుతున్నాయి.

లారెన్స్ కి ద‌క్కిన గౌర‌వం..

హారర్ థ్రిల్లర్ జోనర్లో ‘శివలింగ’ తరువాత లారెన్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో సినిమా రాలేదు. కారమణమేదైనా ఆయన సినిమాల మధ్య గ్యాప్ వచ్చేసింది. ఈ సారి మాత్రం ఆయన పెద్దగా గ్యాప్ లేకుండా రెండు సినిమాలను వదలడానికి రెడీ అవుతున్నాడు .. అందులో ఒకటి ‘రుద్రన్’.

Honorary Doctorate to Raghava Lawrence

Honorary Doctorate to Raghava Lawrence

తెలుగులో రుద్రుడు పేరుతో విడుద‌ల‌వుతుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో క‌థిరేశ‌న్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌లో తెర‌కెక్కుతోంది. కాగా ఈ సినిమా విడుద‌ల తేదీని ఫైన‌ల్ చేసింది లారెన్స్-క‌థిరేశన్ అండ్ టీం. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ..ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్.

లారెన్స్ మ‌రోవైపు పి వాసు డైరెక్ష‌న్‌లో ఆల్ టైమ్ సూప‌ర్ హిట్ బ్లాక్ బాస్ట‌ర్ చంద్ర‌ముఖి సీక్వెల్ చంద్ర‌ముఖి2లో కూడా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కొద్ది రోజుల క్రితం అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అయితే లారెన్స్ మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకోవ‌డంతో పాటు సేవాభావం అనే మరో మానవతా కోణం కూడా చూపించి ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు.

Honorary Doctorate to Raghava Lawrence

Honorary Doctorate to Raghava Lawrence

ఎందరో అనాథలను వికలాంగులను చేరదీస్తూ వారికి కొండంత అండగా ఉండటంతో పాటు వారికోసం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందించి సాయం అందిస్తుంటారు. ఆయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్‌ ప్రకటించాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. రుద్రన్‌ చిత్ర షూటింగ్‌లో ఉన్న లారెన్స్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. బదులుగా ఆయన తల్లి హాజరై గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us