Tapsee : పనికిరాని చాలా మంది బాయ్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేశానంటూ తాప్సీ సంచ‌ల‌న కామెంట్స్

NQ Staff - January 27, 2022 / 07:16 PM IST

Tapsee : పనికిరాని చాలా మంది బాయ్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేశానంటూ తాప్సీ సంచ‌ల‌న కామెంట్స్

Tapsee : టాలీవుడ్ సినీ నటి సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ కి దూరమైన తాప్సీ ఎక్కువ బాలీవుడ్ లో అడుగు పెట్టి వరుస సినిమాలలో నటిస్తుంది. ఏడాదికి ఆరేడు సినిమాలలో నటించడమే కాకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్స్ లో ఒక‌రిగా మారింది.

heroine Tapsee about her boy friends

heroine Tapsee about her boy friends

తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయంది వయ్యారి భామ తాప్సీ తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.టాలీవుడ్ లో వరుస సినిమాలు దక్కించుకుంటూ బిజీగా హీరోయిన్‌గా మారింది. దూసుకుపోతున్న సమయంలోనే తమిళ్ నుంచి కూడా ఆఫర్లు అందుకుంది.

తాప్సీ వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతుంది.హీరోయిన్‏గా చేస్తూనే.. ప్రొడ్యూసర్‏గానూ మారి తన చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. మీరెప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా.. `అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను` అని చిరునవ్వులు చిందిస్తూ సమాధానం ఇచ్చింది.

అలాగే తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. ‘నేను మాథ్యూస్ ను మా నాన్నకు పరిచయం చేసినప్పుడు.. అన్నింట్లో తప్పులు వెతికే మా నాన్న. .అతడి ఎంపికలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదు’అని చెప్పుకొచ్చింది తాప్సీ. గతంలో తన తొలి చిత్ర దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసిన తాప్సీ.. తాజాగా తన స్నేహితులపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us