Deepika Padukone : కోవిడ్ వ‌చ్చాక గుర్తు ప‌ట్ట‌కుండా మారాను.. భ‌యంక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన దీపికా ప‌దుకొణే

Deepika Padukone : క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌ని చిన్నాభిన్నం చేసిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు మృత్యువాత ప‌డ‌గా, మ‌రి కొంద‌రు గుర్తు ప‌ట్ట‌కుండా మారారు. కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొణె ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వూలో సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ సమయంలో తాను గడిపిన రోజులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

heroine Deepika Padukone on her battle with corona
heroine Deepika Padukone on her battle with corona

గతేడాది దీపికాతో పాటు ఆమెతల్లి ఉజాలా, తండ్రి ప్రకాశ్‌, సోదరి అనీషా.. ఇలా కుటుంబం మొత్తం కోవిడ్‌ బారిన పడింది. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంది దీపికా. ‘కరోనా అటాక్‌ తర్వాత నా జీవితమే మారిపోయింది. ఎందుకంటే మహమ్మారి బారిన పడ్డాక నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి.

heroine Deepika Padukone on her battle with corona
heroine Deepika Padukone on her battle with corona

నేను వేసుకున్న మందులు, నాకిచ్చిన స్టెరాయిడ్స్‌ వల్లేమో.. నేనసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. నిజంగా కోవిడ్‌ చాలా భయంకరమైంది. మీ శరీరమే కాదు, మీ మెదడు కూడా చిత్రవిచిత్ర అనుభూతిని పొందుతుంది.’కరోనా సోకినప్పుడు పెద్ద భయమనిపించలేదు. కానీ దాన్నుంచి బయటపడ్డ తర్వాత నా బుర్ర అసలు పని చేయలేదు.

అందుకే రెండు నెలలు షూటింగ్స్‌కు బ్రేక్‌ చెప్పాను. అది నా జీవితంలోనే అత్యంత క్లిష్టమైన ఫ్లేజ్‌’ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే దీపికా నటించిన లేటెస్ట్‌ మూవీ గెహ్రాయాన్‌. శకున్‌ బాత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

దీపికా పదుకొణె పేరుకే బాలీవుడ్ హీరోయన్‌ అయనా తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్‌ ఉన్న హీరోయిన్. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించింది ఈ అమ్మడు. తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ సరసన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బీటౌన్‌లో అడుగుపెట్టి ‘బెస్ట్ ఫీమేల్‌ డెబ్యూ’ అవార్డు అందుకుంది. త్వ‌ర‌లో ప్ర‌భాస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది.