Venkatesh : కొత్త వ్యాపారం మొద‌లు పెట్టిన వెంక‌టేష్‌.. త‌గ్గేదే లే అంటున్నాడుగా..!

Venkatesh : టాలీవుడ్ హీరోలు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్‌ల‌లో రాణించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఒక‌ప్పుడు హీరోలు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న బిజినెస్‌లు చేసే అవ‌కాశం ఉండేది కాదు. కాని ఇప్పుడు సినిమాల సంఖ్య త‌గ్గించి బిజినెస్‌ల‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. కొంద‌రు థియేట‌ర్స్, మ‌రి కొంద‌రు ఇత‌ర బిజినెస్‌ల‌లో రాణిస్తున్నారు.

Hero Venkatesh new business
Hero Venkatesh new business

మ‌హేష్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, విష్ణు మంచు, నాగార్జున ఇలా అంద‌రూ ఈ లిస్టులోనే వ‌స్తారు. ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో హీరో కూడా చేరారు. ఆయ‌నే మ‌న సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. సినిమా, స్టూడియో వ్య‌వ‌హారాలు అని కాకుండా, వెంట‌కేష్ అప్పుడ‌ప్పుడు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి బైక్ వో అనే సంస్థ‌తో చేతులు క‌లిపారు. ఇంత‌కీ ఈ సంస్థ ఏం చేస్తుందో తెలుసా? ఎల‌క్ట్రిక్ ద్వి చ‌క్ర వాహ‌నాలకు చార్జింగ్, స‌ర్వీసింగ్ చేయ‌డం వంటి సేవ‌ల‌ను అందిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ మార్కెటింగ్, బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం వెంక‌టేష్ చేతులు క‌లిపారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల ఓటీటీలో నార‌ప్ప‌, దృశ్యం 2 చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న విక్ట‌రీ వెంక‌టేష్ త్వ‌ర‌లోనే F3 మూవీతో సంద‌డి చేయ‌డానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా సినిమాను మ‌రింత వెన‌క్కి వెళుతుంద‌ని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌.