siddarth : ప్ర‌ధాని కాన్వాయ్ ఘ‌ట‌న పెద్ద డ్రామా.. బీజేపీ నేత‌లు నాట‌కాలాడారంటూ సిద్ధార్థ్ ఫైర్

 

siddarth :హుసేనీవాలాలోని అమరవీరుల స్మారకానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన మంత్రి కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ మీదకు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు ఆ మార్గాన్ని జామ్ చేసిన తెలిసిందే. దాంతో ప్రధాని ఆ ఫ్లైఓవర్ మీదే 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయారు. ప్రధాని మోదీకి చేసిన భద్రతా ఏర్పాట్లలో ఇది ఒక పెద్ద లోపం అని హోంమంత్రిత్వ శాఖ చెప్పింది.

sidarth
sidarth

“నేను ప్రాణాలతో తిరిగి భటిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నందుకు, మీ ముఖ్యమంత్రికి థాంక్స్ చెప్పండి అని ప్ర‌ధాని ఈ ఇష్యూపై సెటైర్ వేశారు. అయితే ఈ సంఘ‌ట‌న‌పై ప‌లువురు త‌మ అభిప్రాయాలు తెలియ‌జేస్తున్నారు. కావాల‌నే చేశారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పుడు న‌టుడు సిద్ధార్థ్ కూడా చేరారు.

siddarth
siddarth

ఇదో పెద్ద డ్రామాగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. నిజంగా ఇది ప్రధాని కాన్వాయేనా…? అసలు అందులో ప్రధాని ఉన్నారా? అంటూ ప్రశ్నించాడు. ప్రధాని కాన్వాయ్‌లో ఉన్నది నటులు కావొచ్చని.. గతంలోనూ పలువురు బీజేపీ నేతలు ఎన్నోసార్లు నాటకాలు ఆడిన సందర్భాలు ఉన్నాయంటూ సిద్ధార్థ్ ఆరోపించాడు.

siddarth
siddarth

ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లపై బీజేపీ నేతలు మండిపడుతుంటే… మరికొందరు మాత్రం సమర్ధిస్తున్నారు.మరోవైపు ప్రధాని కాన్వాయ్ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ చేసిన ప్రకటనపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

siddarth
siddarth

ఈ ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. పంజాబ్‌లో జరిగిన ఘటన నిజంగా అవమానకరమని… ప్రధానమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత అని… ఆయన 140 కోట్ల ప్రజల గొంతుక అని కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించింది.