Shivaji : సినిమాల్లో మళ్ళీ యాక్టివ్ అవనున్న నటుడు శివాజీ.!
NQ Staff - July 9, 2022 / 09:35 AM IST

Shivaji : నటుడు శివాజీ, సినిమాల్ని పక్కన పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయిన విషయం విదితమే. గతంలో ఆయన బీజేపీలో వున్నారు. ఆ తర్వాత టీడీపీ మద్దతుదారుడిగా మారిపోయారు. ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో అప్పట్లో శివాజీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

hero Shivaji again busy in tollywood movies
‘ఆపరేషన్ గరుడ.’ అంటూ ఏపీ రాజకీయాల్లో శివాజీ అప్పట్లో ఓ పెను సంచలనం.. అన్నట్టు, మీడియా ఆయన చుట్టూ చాలా ఫోకస్ పెట్టింది. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా ఆ రాజకీయ తెరపైన కూడా శివాజీ కనుమరుగైపోయారు.
టీవీ9 రవిప్రకాష్‌తో కలిసి రచ్చ..
టీవీ9 మాజీ సీఈఓ రజనీకాంత్‌తో కలిసి శివాజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పట్లో అభియోగాలు మోపబడ్డాయి. ఆయన విదేశాలకు వెళ్ళేందుకూ పోలీసుల అనుమతి తప్పనిసరైంది. అలా రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది శివాజీ పరిస్థితి.
చాన్నాళ్ళ తర్వాత ఓ సినీ వేదికపై ఇటీవల కనిపించిన శివాజీ, రాజకీయాల వైపు చూడకపోయి వుంటే, సినిమాల్లో కోట్లు సంపాదించేవాడినని చెప్పుకున్నారు. తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, సినిమాల్లో మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట శివాజీ.
అయితే, నటుడిగా కాకుండా దర్శకత్వం, నిర్మాణం వైపు ఆయన ఫోకస్ పెట్టాడట. నిజమేనా.? వేచి చూడాల్సిందే.