Naga Sourya : బిగ్ ట్విస్ట్: నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోవడానికి అదే కారణమా.?

NQ Staff - November 14, 2022 / 10:33 PM IST

Naga Sourya : బిగ్ ట్విస్ట్: నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోవడానికి అదే కారణమా.?

Naga Sourya : యంగ్ హీరో నాగ శౌర్య తన తాజా సినిమా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఊహించని ఈ ఘటనతో షాక్ తిన్న యూనిట్ సిబ్బంది వెంటనే, ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

నాగ శౌర్య త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో నాగ శౌర్య వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో నాగ శౌర్య షూటింగ్ స్పాట్‌లో కళ్ళు తిరిగిపడిపోయాడన్న వార్త మరింతగా అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది.

అదా అసలు విషయం.?

నాగ శౌర్యకి అసలేమయ్యింది.? అంటూ అభిమానులు ఆందోళన చెందుతుండగా, అసలు విషయం బయటకు పొక్కింది. ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ సందర్భంగా నాగ శౌర్య కళ్ళు తిరిగి పడిపోయాడట. సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపించే క్రమంలో మూడు రోజులుగా వాటర్ తాగలేదట నాగ శౌర్య.

దాంతో, డీహైడ్రేషన్‌కి గురయి, నాగ శౌర్య కళ్ళు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. అవసరమైన ఫ్లూయిడ్స్ నాగ శౌర్యకి ఆసుపత్రిలో ఎక్కించాక ఆయన కోలుకున్నాడట. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో నాగ శౌర్య చికిత్స తీసుకుంటున్నాడు.

యాబ్స్ చూపించేందుకోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవడమే ఇలాంటి సమస్యలకు కారణం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us