Balakrishna : మంత్రి హరీష్ రావుతో భేటీ అయిన నటుడు నందమూరి బాలకృష్ణ

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే మ‌రోవైపు డిజిటిల్ మీడియా ఆహాలో అన్‌స్టాప‌బుల్ అనే షోతో దుమ్మురేపుతున్నాడు. మ‌రోవైపు ఇటీవ‌ల అఖండ అనే సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్నాడు. ఈ క్ర‌మంలో బాల‌కృష్ణ స్పీడ్ పెంచాడు. అఖండ‌ సినిమా హిట్‌తో గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు బాలయ్య.

Hero Balakrishna meets minister Harish Rao
Hero Balakrishna meets minister Harish Rao

ఈ మూవీకి సుమారు రూ. 15 నుంచి 20 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట బాలకృష్ణ. ఈ సినిమాతో పాటు బాలయ్య మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే బాలకృష్ణ యాక్టింగ్‌, స్టార్‌డమ్‌, బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ అడిగిన రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట నిర్మాతలు.

నందమూరి నట సింహం బాలయ్య.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ధాలు గడుస్తోన్నా ఇప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తనదైన మాస్‌ డైలాగ్‌లు, ఫైటింగ్‌లతో జై బాలయ్య అనిపించుకుంటున్నారు. తాజాగా అఖండ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన నట సింహం తనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు.

ఒక‌వైపు బాల‌కృష్ణ సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల‌లోను త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు. తాజాగా బాల‌కృష్ణ తెలంగాణ మంత్రి హ‌రీష్ రావుని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ ఇద్ద‌రి భేటిపై ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. స‌డెన్‌గా బాల‌కృష్ణ ఎందుకు క‌లిసాడు అనే దానిపై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తుంది.