Hema Chandra : శ్రావ‌ణ భార్గ‌వి, హేమ చంద్ర విడాకులు తీసుకున్నారా.. ఇందులో నిజ‌మెంత‌?

NQ Staff - June 25, 2022 / 07:05 PM IST

135943Hema Chandra : శ్రావ‌ణ భార్గ‌వి, హేమ చంద్ర విడాకులు తీసుకున్నారా.. ఇందులో నిజ‌మెంత‌?

Hema Chandra : సినిమా వాళ్ల‌పై పాశ్చాత్య దేశాల ప్ర‌భావం బాగానే ప‌డింది. పెళ్లి విష‌యంలో వారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు అభిమానుల‌కి ఆగ్ర‌హాన్ని తెప్పిస్తున్నాయి. ఒక‌ప్పుడు భార్య‌, భ‌ర్త‌లు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా విడిపోయేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. కాని ఇప్పుడ‌లా కాదు. చిన్న చిన్న కార‌ణాల‌కు బ్రేక‌ప్ అంటూ మ‌రో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు.

Hema Chandra and Sravana Bhargavi divorce

Hema Chandra and Sravana Bhargavi divorce

విడాకుల బాట‌..

స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారం ఎంత సెన్సేష‌న్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత కూడా చాలా మంది ప్ర‌ముఖులు డైవ‌ర్స్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ గాయనీ, గాయకులు శ్రావణ భార్గవి – హేమచంద్ర విడాకులు తీసుకోబోతున్న‌ట్టు జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. తెలుగులో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన హేమచంద్ర అనేక సూపర్ హిట్ సాంగ్స్ అందించడమే కాక అనేకమందికి తన గాత్ర దానం చేశాడు.

శ్రావణ భార్గవి కూడా తెలుగులో అనేక సినిమాల్లో సింగర్ గా తన ప్రతిభను చాటింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి 2013వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా శిఖర చంద్రిక అనే ఒక కుమార్తె కూడా 2016వ సంవత్సరంలో జన్మించింది. అయితే నిప్పు లేకుండా పొగ రాదు అన్న చందాన, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

పలు వెబ్ సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ లో పెద్ద ఎత్తున కథనాలు బయటకు వస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హేమ చంద్ర వీటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో అంద‌రిలో అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. మరికొందరైతే హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా అకౌంట్స్ లోకి వెళ్లి వాళ్ళ పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు. ఇలా వార్తలు వస్తున్నాయి, నిజమా లేదా? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఈ జంట‌కి వ్య‌క్తిగ‌తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.. అలాంటిది ఇప్పుడు వీరి మ‌ధ్య గ్యాప్‌.. విడాకుల వార్త‌ల‌తో అభిమానులు ఎంతో బాధ‌ప‌డుతున్నారు. ఇంజ‌నీరింగ్ చ‌దివి.. ఏంబీయే చేసిన శ్రావ‌ణ భార్గ‌వి పాట‌లు పాడ‌డంతో మంచి డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకుంది. ఇద్ద‌రూ క‌లిసి బుల్లితెర మీద క‌నిపిస్తే ఆ మ‌జాయే వేరు. హేమ‌చంద్ర డ‌బ్బింగ్ ఆర్టిస్టు.. నాలుగైదు సినిమాల‌కు మ్యూజిక్ కూడా కంపోజ్ చేశాడు. ఇటీవ‌ల ఆహాలో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షోకు కూడా క‌లిసే వ‌చ్చారు. ఇంత‌లోనే ఈ వార్త‌లు. ఈ వార్త అబ‌ద్ధం అయితే బాగుండు అని నెటిజ‌న్స్ కోరుతున్నారు.