Bigg Boss Show : బిగ్‌ బాస్ బ్యాన్‌ చేయాల్సిందే.. కోర్టు తీర్పు పై ఉత్కంఠ

NQ Staff - September 30, 2022 / 01:58 PM IST

Bigg Boss Show : బిగ్‌ బాస్ బ్యాన్‌ చేయాల్సిందే.. కోర్టు తీర్పు పై ఉత్కంఠ

Bigg Boss Show : తెలుగు బిగ్ బాస్ ప్రతి సీజన్ కి ఏదో ఒక వివాదం ని ఎదుర్కొంటూనే ఉంటుంది. బిగ్ బాస్‌ అనేది భారతీయ సంస్కృతికి మంచిది కాదని, భారతీయ కట్టు బాట్లు పద్ధతులకు బిగ్ బాస్ షో ఫార్మాట్ సరైనది కాదంటూ చాలా కాలంగా చాలా మంది కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు.

తెలుగు బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటూ

తాజాగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఐబీఎఫ్ గైడ్లైన్స్ పాటించలేదని అశ్లీలత ఎక్కువగా బిగ్ బాస్ లో ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. బిగ్బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రవర్తన సమాజంపై తప్పుడుగా ఉంటుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అశ్లీలతపై ఘాటుగా స్పందించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు పంపిస్తామని, త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని తెలియ జేసింది. విచారణ అక్టోబర్ 11 కు వాయిదా వేయడం జరిగింది. కోర్టు తీసుకోబోతున్న కీలక నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ యొక్క భవిష్యత్తు ఇప్పుడు సందీగ్దంలో పడ్డట్లు అయ్యింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us