Adipurush : ‘ఆదిపురుష్’ హీరో ప్రభాస్ కాదా.? రామ్‌చరణ్ పేరెందుకు ట్రెండింగ్‌లో వుంది.?
NQ Staff - October 2, 2022 / 04:39 PM IST

Adipurush : పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. సినిమా టీజర్ ఈ రోజే విడుదల కాబోతోంది. అయోధ్య ఇందుకు వేదిక కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం విదితమే.
కాగా, దేశవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో వుంది. చిత్రమేంటంటే, ‘ఆదిపురుష్’తోపాటుగా ప్రభాస్ పేరు ట్రెండింగ్ అవ్వాల్సింది పోయి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ట్రెండింగ్ అవుతోంది.
ఆది పురుష్.. రామ్ చరణ్.. ఏంటి లింకు.?
‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ ఓ గెటప్‌లో అల్లూరి సీతారామరాజులా కనిపిస్తాడు. కానీ, అది కాస్తా రాముడి గెటప్‌గా నార్త్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయి పోయింది. అద్గదీ అసలు సంగతి.
‘ఆదిపురుష్’లో ప్రభాస్ లుక్ సూపర్బ్‌గా వున్నగానీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రాముడి గెటప్ అని నార్త్ ఆడియన్స్ అనుకుంటున్న అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామ్ చరణ్ వున్నంత పవర్‌ఫుల్‌గా లేదన్నది నిర్వివాదాంశం.
అందుకే, ‘ఆదిపురుష్’తోపాటు రామ్ చరణ్ పేరు ట్రెండింగ్‌లో వుంది తప్ప, ప్రభాస్ది కాదు. ఈ విషయమై ప్రభాస్, రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ ట్రోలింగ్ జరుగుతోంది.