Harish Shankar : పవన్ సినిమా దర్శకుడిని డైరెక్ట్‌ గా ఎటాక్ చేసిన చిన్న హీరోయిన్‌

NQ Staff - September 27, 2022 / 05:11 PM IST

Harish Shankar : పవన్ సినిమా దర్శకుడిని డైరెక్ట్‌ గా ఎటాక్ చేసిన చిన్న హీరోయిన్‌

Harish Shankar : హీరోయిన్ రెజీనా సున్నితంగా దర్శకుడు హరీష్ శంకర్ ని టార్గెట్ చేసి విమర్శించింది, అతడి తీరును డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది. హీరోయిన్స్ అంటే దర్శకులకు చిన్న చూపు అన్నట్లుగా ఆమె ట్వీట్‌ లో పేర్కొంది.

అసలు విషయం ఏంటంటే..

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి వచ్చిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏడు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ తన ఆనందం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

అప్పుడే ఏడు సంవత్సరాలు అయ్యాయి అంటే నమ్మలేకుండా ఉన్నాను అంటూ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసి హీరో సాయి ధరమ్ తేజ్ తో పాటు మరి కొందరిని ట్విట్టర్ లో ట్యాగ్ చేశాడు.

ఆ ట్వీట్‌ లో హీరోయిన్ రెజీనా ని ట్యాగ్ చేయక పోవడం తో ఆమె స్పందించింది. ఆమె ట్విట్టర్ లో… మా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దర్శకుడు హరీష్ శంకర్ గారు కొన్ని క్యారెక్టర్ లను మెన్షన్ చేయడం మర్చిపోయినట్లున్నారు.. అయినా కూడా ‘సీతతో అంత ఈజీ కాదు’ అనే డైలాగ్ నాకిచ్చి చాలా ఫేమస్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసిన దర్శకుడు హరి శంకర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రెజినా కౌంటర్ ట్వీట్‌ చేసింది.

తన పేరును మెన్షన్ చేయలేదు అని డైరెక్టుగా అనకుండానే అందరికీ అర్థం అయ్యేలా హరీష్ శంకర్ కి ఆమె ఇచ్చిన కౌంటర్ అందరిని ఆశ్చర్య పరచుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ రెజినా ట్వీట్ కి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us