Harish Rao : కల్లబొల్లి కబుర్లు చెప్పిన బీజేపీ : మంత్రి హరీష్ సెటైర్
NQ Staff - July 4, 2022 / 09:41 AM IST

Harish Rao : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారని తెలంగాణ బీజేపీ నేతలు చాలా చాలా ఆశపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయ్. ప్రధాని నరేంద్ర మోడీ, బహిరంగ సభలో మాట్లాడారు. అంతే, ఓ ప్రసహనం ముగిసింది.

Harish Rao comments on BJP and PM Narendra Modi
ఇంతకీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా, బీజేపీ జాతీయ నాయకులు హైద్రాబాద్ రావడం వల్ల, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వల్ల తెలంగాణ బీజేపీకి ఒరిగిందేంటి.? ఈ విషయమై బీజేపీలోనే భిన్న వాదనలున్నాయి. ఇంతకీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ హంగామాపై ఏమంటోంది.?
జవాబుదారీతనమే లేదని నిరూపించిన ప్రధాని: హరీష్ సెటైరు..
‘జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి,తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించాం.కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారు.కేసీఆర్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారు’ అంటూ ట్వీటేశారు తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, మంత్రి హరీష్ రావు.
హరీష్ రావు ట్వీటు కాస్తా, తెలంగాణ బీజేపీ నేతలకు పుండు మీద కారం చల్లిన వైనంలా కనిపిస్తోంది. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం, తమ వ్యూహం ఫలించిందనీ, బీజేపీ కార్యవర్గ సమావేశాల్ని డైల్యూట్ చేయగలిగామనీ చెబుతుండడం గమనార్హం.