Harihara Veeramallu : హరిహర వీరమల్లు : ఒక్క యాక్షన్ ఎపిసోడ్‌ కే పది కోట్లు ఖర్చు.?

NQ Staff - November 1, 2022 / 10:25 PM IST

Harihara Veeramallu : హరిహర వీరమల్లు : ఒక్క యాక్షన్ ఎపిసోడ్‌ కే పది కోట్లు ఖర్చు.?

Harihara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్, రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్న పవన్ కళ్యాణ్, వీలైనంత త్వరగా ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించి హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. 15 నుంచి 20 రోజులపాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

10 కోట్ల ఖర్చుతో..

యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ ఈ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తుండగా, ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 10 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట.

ఇదిలా వుంటే, కొద్దిరోజుల క్రితమే ఈ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా వర్క్ షాప్స్ నిర్వహించింది. హాలీవుడ్ నుంచి సైతం సాంకేతిక నిపుణుల్ని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ని ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us