Hari Hara Veeramallu Movie : ‘హరి హర వీరమల్లు’ వర్క్ షాప్’.! పవన్ కళ్యాణ్ అంటే ఇట్లుండాలె.!
NQ Staff - October 10, 2022 / 05:41 PM IST

Hari Hara Veeramallu Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ యంగ్ లుక్స్‌లోకి మారిపోయారు. క్రిష్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్ స్టార్ట్ చేశారు.
వాస్తవానికి ఈ సినిమా ఆ పాటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. అక్టోబర్‌లో సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంత కాలం సినిమా షూటింగ్ వాయిదా పడింది.
పవన్ లుక్స్.. ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్స్.!
ఆ తర్వాత షూటింగుల బంద్ ఇష్యూతో మరికొంత కాలం వాయిదా పడింది. అలా వాయిదాల పర్వం ముగించుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం మళ్లీ రీసెంట్‌గా షూటింగ్ షురూ చేసింది. యాక్షన్ ప్రధానాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి, కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయ్.

Hari Hara Veeramallu Movie Pawan Kalyan Latest Photos
ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ మరీ యంగ్‌గా కనిపిస్తూ, ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేస్తున్నారు. ప్రాచీన యుద్ధ కళా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసే మార్షల్ ఆర్ట్స్ ఆధ్యంతం ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా వుండబోతున్నాయని రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఆల్రెడీ ప్రూవ్ చేశారు.
ఇక, ఈ ఫోటోలు సినిమాపై అంచనాల్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా వున్నాయ్. నెట్టింట్లో ఇప్పుడీ పిక్స్ పిచ్చ పిచ్చగా ట్రెండింగ్ అవుతున్నాయ్. ఇక ఈ సినిమా కోసం అందాల భామ నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌తో జత కడుతోన్న సంగతి తెలిసిందే. తెలుగమ్మాయ్ పూజిత పొన్నాడ ఓ స్పెషల్ సాంగ్ నటిస్తోంది.