Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు సినిమాకు వర్షం దెబ్బ
NQ Staff - November 2, 2022 / 02:26 PM IST

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో భారీ యాక్షన్ సన్నివేశాలను సినిమా కోసం వేసిన ప్రత్యేకంగా దర్శకుడు క్రిష్ చేస్తున్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే వర్షం కారణంగా అనుకున్న స్థాయిలో షూటింగ్ చేయలేక పోయారట.
మధ్యాహ్నం వరకి వర్షం రావడంతో యాక్షన్స్ అన్నివేశాలను చిత్రీకరించలేక పోయారని సమాచారం అందుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుండి చకచకా సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని.. నేడు కూడా పవన్ కళ్యాణ్ పై చిత్రీకరణ జరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొదటి సారి ఒక పీరియాడిక్ డ్రామా కథ తో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు క్రిష్ ఈ సినిమా ను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ సహకరిస్తే సమ్మర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. పవన్ జనసేన కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికే ఆలస్యమైన షూటింగ్ మరియు ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందిస్తుంది.