Hansika : హీరోయిన్ పెళ్ళికి పేద చిన్నారులే అతిథులు.!

NQ Staff - December 4, 2022 / 12:54 PM IST

Hansika : హీరోయిన్ పెళ్ళికి పేద చిన్నారులే అతిథులు.!

Hansika : సినీ ప్రముఖుల పెళ్ళిళ్ళంటే అతిథుల లిస్టు చాంతాడంత వుంటుంది. హై క్లాస్ వారికి మాత్రమే ఈ వివాహ వేడుకలకు ఆహ్వానం వెళ్ళడం మామూలే. కానీ, ఇక్కడ విషయం వేరే వుంది.

బాలీవుడ్ బ్యూటీ హన్సిక మోత్వానీ, తెలుగు అలాగే తమిళ సినీ పరిశ్రమల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘దేశముదురు’.

పెళ్ళికి విశేష అతిథుల్ని ఆహ్వానించిన హన్సిక..

హన్సికకి సేవా కార్యక్రమాలంటే ఇష్టం. ఈ క్రమంలో ఆమె కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుంటుంది కూడా. తన పెళ్ళికి హాజరయ్యే అతిథుల లిస్టులో కొందరు చిన్నారుల్నీ చేర్చింది. వారంతా నిరుపేదలు.. పైగా, అనాధలు కూడా.

హన్సిక పంపిన ఆహ్వాన పత్రాలు చూసి ఆ చిన్నారులు మురిసిపోయారు. రాజస్థాన్‌లో హన్సిక వివాహం జరగనుంది. వివాహ వేడుకలు అప్పుడే ప్రారంభమైపోయాయ్ కూడా. ఏదో పబ్లిసిటీ కోసం అన్నట్లు కాకుండా, చిన్నారులకు అతిథి మర్యాదలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా హన్సిక, ఆమెకు కాబోయే భర్త చేయించినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో హన్సికకి హేట్సాఫ్ చెప్పి తీరాల్సిందే కదా.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us