Gunturu Karam : గుంటూరు కారం వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తోంది
NQ Staff - June 4, 2023 / 11:35 PM IST

Gunturu Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు గుంటూరు కారం అనే టైటిల్ ని ఇటీవలే కన్ఫామ్ చేయడం జరిగింది. టైటిల్ కన్ఫామ్ చేయడంతో పాటు మహేష్ బాబు మాస్ లుక్ స్టిల్ ని విడుదల చేయడం జరిగింది.
ఆ పోస్టర్ లో మహేష్ బాబు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో విభిన్నమైన చెక్స్ షర్ట్ ని ధరించాడు. ఆ షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్ కార్ట్ లో సదరు షర్టు 3000 రూపాయలకు పెట్టడం జరిగిందట.
షర్టుకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. మొత్తానికి గుంటూరు కారం సినిమా ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు ధరించిన ఆ షర్ట్ ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు మోస్ట్ వాంటెడ్ గా మారింది.
ఎవరు చూసినా కూడా ఆ షర్ట్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. దాంతో భారీ ఎత్తున ఆర్డర్స్ నమోదు అవుతున్నాయని సమాచారం అందుతుంది. ఈ సమయంలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ని పెట్టడంతో మరింతగా అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.