YSRCP : గుడివాడ వైసీపీ కొత్త నినాదం: ‘మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం’.!

NQ Staff - September 23, 2022 / 06:40 PM IST

YSRCP : గుడివాడ వైసీపీ కొత్త నినాదం: ‘మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం’.!

YSRCP : రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రత్యారోపణలూ సహజం. చంపుకోవడాల సంగతేంటి.? ఇది కూడా సహజమేనని అనుకోవాలేమో.! ఏకంగా వైసీపీ నేతలు కొందరు ‘చంపేస్తాం’ అంటూ ఫ్లెక్సీలు పెడుతూ, రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరిస్తున్నారు.

Gudivada YSRCP Leaders warning

Gudivada YSRCP Leaders warning

గుడివాడ నియోజకవర్గ సరిహద్దు గ్రామం రెడ్డి పాలెంలో కొందరు వైసీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. ‘వైసీపీ యువదళం’ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కొందరు వైసీపీ మద్దతుదారులు.

అమరావతి రైతులకేనా ఆ హెచ్చరికలు.?

అమరావతి రైతుల పాదయాత్ర రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులే ఈ ఫ్లెక్సీలను పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘మేం ఎవరి జోలికీ వెళ్ళం.. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం..’ అంటూ వైసీపీ యువ దళం పేరుతో కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నట్లు.? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.? అన్న విమర్శ వినిపిస్తోంది.

అధికార పార్టీకి వత్తాసు పలికే పోలీస్ వ్యవస్థ, ఏ స్థాయి అరాచకాన్నైనా ప్రోత్సహించేలా వుందన్నది ఈ వ్యవహారంపై టీడీపీ స్పందనగా కనిపిస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us