UV Creation : బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యువి’లో జిఎస్టీ తనిఖీలు.!

NQ Staff - November 1, 2022 / 10:34 PM IST

UV Creation : బిగ్ బ్రేకింగ్ : ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యువి’లో జిఎస్టీ తనిఖీలు.!

UV Creation : తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యువీ క్రియేషన్స్‌ కూడా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఈ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాల్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాలు నిరాశపర్చాయి. అయినాగానీ, యువీ సంస్థ అస్సలేమాత్రం ‘తగ్గేదే లే’ అంటోంది. అంతకు మించిన భారీ సినిమాల నిర్మాణానికి సిద్ధంగా వున్నట్లు చెబుతోంది.

జీఎస్టీ సోదాలు.. ఎందుకబ్బా.?

తాజాగా యువీ సంస్థలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఉదయం నుంచీ జరుగుతుండగా, కీలక పత్రాల్ని యువీ సంస్థ నుంచి అధికారులు స్వాధీనం చేసకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమైన సమయంలో ఐటీ అధికారులు ఆయా చిత్రాల నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో జీఎస్టీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

జీఎస్టీ చెల్లింపుల విషయంలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి వుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us