Bhavadeeyudu Bhagat Singh : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితమే సినిమా టైటిల్ కూడా ప్రకటితమైపోయింది. కానీ, సినిమా పట్టాలెక్కేందుకు మాత్రం చాలా చాలా ఆలస్యమవుతోంది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు.. ఇలా ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం పవన్ కళ్యాణ్‌కి కష్టమవుతోన్న విషయం విదితమే.
ఆగస్టులో ‘భవదీయుడు..’ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందనే ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ సినిమాలంటే వేగంగానే షూటింగ్ జరుపు కుంటాయ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అటు పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్‌ని బ్యాలెన్స్ చేసుకుని, హరీష్ శంకర్ ‘భవదీయుడు..’ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇది అంత తేలికైన వ్యవహారం కాదు.

ఇదిలా వుంటే, ‘భవదీయుడు..’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మేగ్జిమమ్ షూటింగ్ అంతా ‘భారీగా వేసే సెట్స్‌లోనే’ పూర్తి చేసేస్తారట. పాటల కోసం మాత్రం విదేశాలకు వెళ్ళడమా.? లేదంటే, అది కూడా ఫిలిం సిటీ వంటి చోట్ల కానిచ్చేయడమా.? అన్నదానిపై కొంత క్లారిటీ రావాల్సి వుందని అంటున్నారు.
‘భీమ్లానాయక్’ సినిమా షూటింగ్ విషయంలోనూ ఇదే పంథా అనుసరించారు. ‘వకీల్ సాబ్’ సంగతి సరే సరి. అయితే, అవి రెండూ రీమేక్ సినిమాలు. ‘భవదీయుడు భగత్‌సింగ్’ పూర్తిగా ఒరిజినల్. హరీష్ మైండ్‌లో ఎలాంటి క్రియేటివ్ ఐడియాస్ వున్నాయో, అందులో ఔట్‌డోర్ షూట్స్ ఎన్ని వుంటాయో చెప్పలేమనే వాదన కూడా వినిపిస్తోంది ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి. అదీ నిజమే మరి.