Gopichand Malineni : పొలాలు కూడా అమ్ముకున్నాం.. డైరెక్టర్ గోపీచంద్ ఎమోషనల్..!
NQ Staff - January 26, 2023 / 01:05 PM IST
Gopichand Malineni : గోపీచంద్ మలినేని ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. రవితేజతో చేసిన క్రాక్ తర్వాత బాలయ్యతో వీరసింహారెడ్డి మూవీ చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ఆయన తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్లు చేశాడు.
మా చిన్న వయసులో మాకు 40 ఎకరాల దాకా పొలాలు ఉండేవి. మా నాన్న అప్పట్లో మా ఊరిలో పెదరాయుడిలా ఉండేవాడు. నా చిన్న తనంలో మాకు కావలి వెళ్లే హైవే పక్కనే 20 ఎకరాలు ఉండేవి. కానీ మా నాన్న మద్యానికి బానిస అయిపోయాడు. ఫ్రెండ్స్‌కు పార్టీలు ఇవ్వడానికి అప్పులు చేసేవారు.
ఆ భూమి విలువ ఎంతంటే..
ఆ అప్పులు తీర్చడం కోసం భూమిని రాసిచ్చేవారు. రూ.7వేలకు, రూ.10వేలకు ఇలా భూమిని మొత్తం రాసిచ్చేవాడు. అప్పట్లోనే ఆ భూమి ఎకరాన లక్షల్లో ఉండేది. ఇప్పుడు దాని విలువ ఎకరానికి కొన్ని కోట్లు ఉంటుంది అని చెప్పుకొచ్చాడు గోపీచంద్. వాస్తవానికి అంత ఆస్తిపోయినా మా నాన్న మీద నాకు నాకు గౌరవం ఉండేది అంటూ వివరించాడు.
హైవే మీద 20ఎకరాలు అంటే ఎన్ని కోట్ల విలువైన ఆస్తి అనేది అర్థం చేసుకోవచ్చు. గోపీచంద్ ప్లేస్ లో వేరే వారైతే తండ్రిని తిట్టుకునే వారు. కానీ గోపీ మాత్రం అలా చేయలేదు. ఎన్ని ఆస్తులు ఉన్నా లేకపోయినా తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగాడు నేడు.