Godse Movie Review : గాడ్సే మూవీ రివ్యూ
NQ Staff - June 17, 2022 / 01:12 PM IST

Godse Movie Review : ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మించారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో నాగబాబు, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి, నోయల్ సీన్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్ధా..
కథ:
అవినీతి వ్యవస్థతో విసిగిపోయిన గాడ్సే (సత్యదేవ్) ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేయడం అలవాటు చేసుకున్న రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అవినీతి రాజకీయ నాయకులందరినీ హతమారుస్తూ ఉంటాడు, అయితే గాడ్సే ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక పోలీసు అధికారిని నియమిస్తుంది. దర్యాప్తు ప్రక్రియలో గాడ్సే గురించి మరియు అతని గతం గురించి అసలు నిజాలు తెలుస్తాయి. ఒక మంచి మనిషి గాడ్సే ఎందుకు హింసాత్మకంగా మారాడు అనేది మిగిలిన కథ . అతను వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు వెళ్తాడు అనేది సినిమా యొక్క కీలకమైన కథాంశం.

Godse Movie Review
నటీనటుల పర్‌ఫార్మెన్స్:
సత్యదేవ్ తన వంతుగా మెప్పించేలా చేశాడు. మల్టీ లేయర్డ్ క్యారెక్టర్‌ని అతను చూపించిన విధానం బాగుంది. గాడ్సే పాత్రలో సత్యదేవ్ ఎంత అద్భుతమైన నటుడో మరోసారి నిరూపించాడు. సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయి. సత్యదేవ్ మాత్రమే ఆ డైలాగ్స్ చెప్పగలడని నిరూపించాడు, ఐశ్వర్య లక్ష్మికి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది. స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది . బ్రహ్మాజీ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన తారాగణం బాగా చేసారు. అర్జున్ రెడ్డి ఫేమ్ జియా శర్మ గాడ్సే భార్యగా అతిధి పాత్రలో డీసెంట్‌గా నటించింది.
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
గోపీ గణేష్ పట్టాభికి సమాజంపై బలమైన ఆలోచనలు ఉన్నాయ్, అతను ఎల్లప్పుడూ సినిమాలో కొన్ని సామాజిక సమస్యలను ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాడు. అయితే కమర్షియల్ ఫార్మాట్‌లో అది సరిపోలేదు . దీంతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాడు. కానీ అతని డైలాగ్స్ మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. టెక్నికల్ గా గాడ్సే బాగుంది కానీ సినిమాటోగ్రఫీ ఇంకా బాగుండాల్సింది మరియు సునీల్ కశ్యప్ సంగీతం సినిమాకు సూట్ అయ్యింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇచ్చాడు. సి కళ్యాణ్ సికె స్క్రీన్స్ నిర్మాణ విలువలు మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Godse Movie Review
ప్లస్ పాయింట్స్ :
సత్యదేవ్
ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు
కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో రొటీన్ నేరేషన్
రిపీట్ సన్నివేశాలు

Godse Movie Review
విశ్లేషణ:
భారతదేశంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఓ సామాన్య యువకుడు చేసే పోరాటం నేపథ్యంతో ఈ గాడ్సే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా లోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా రూపొందించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించడంతో సినిమాపై హైప్ నెలకొంది. అయితే డైరెక్టర్ కథను నడిపించిన విధానం గ్రిప్పింగ్‌గా లేదు. ఉత్కంఠ రేపే విధంగా ఫస్టాఫ్ ఉండగా.. అందుకు కొనసాగింపుగా సెకండాఫ్ సాగిపోయింది.క్లైమాక్స్ కొంత సినిమాకి ప్లస్ అయింది. గతంలో వచ్చిన ‘భారతీయుడు’, ‘జెంటిల్‌మన్’ వంటి చిత్రాల మాదిరిగా ఉండడంతో ఇందులో కొత్తదనం లోపించింది. యాక్షన్ డ్రామాని ఇష్టపడే వాళ్లకి మాత్రమే సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 1.5/5