Godfather Movie : ఇంత హడావుడి చేసి గాడ్‌ ఫాదర్ రాబట్టింది ఇంతేనా?

NQ Staff - October 27, 2022 / 08:16 PM IST

Godfather Movie  : ఇంత హడావుడి చేసి గాడ్‌ ఫాదర్ రాబట్టింది ఇంతేనా?

Godfather Movie  : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ దాదాపు 90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది.

అంతే కాకుండా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ లేక పోయిందట.

ఇక బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని నమ్మకం కూడా లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం 60 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే ఈ సినిమా నమోదు చేసిందని మరో 30 కోట్లు ఈ సినిమాకు నష్టం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

తెలుగు మరియు హిందీ లో కూడా విడుదలైన ఈ సినిమా ను ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆదరించలేదు.. అయినా కూడా కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.

మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా దారుణమైన కలెక్షన్స్ నమోదు చేసిందని చెప్పాలి.. అయితే ఆచార్య సినిమా తో పోలిస్తే ఈ సినిమా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us