Getup Srinu : మంత్రి రోజాపై గెటప్ శ్రీను ఫైర్.. మీ గౌరవాన్ని కోల్పోకండి
NQ Staff - January 7, 2023 / 07:12 PM IST

Getup Srinu : మంత్రి రోజా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ పై చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఆమెను ఇన్నాళ్లు గౌరవించిన వారు.. ఆమెను అభిమానించిన వారు కూడా చాలా మంది ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి దర్శణం కోసం ఎంతో ప్రయత్నించిన రోజా.. మంత్రి పదవి దక్కగానే ఆయన వద్దకు వెళ్లి కలిసిన రోజా ఇప్పుడు ఆయన్నే విమర్శించడం విడ్డూరం.
తాజాగా మంత్రి రోజా విమర్శలపై జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కాస్త సీరియస్ గానే స్పందించాడు. ఆయన మాట్లాడుతూ కేవలం మీ ఉనికి కోసం ఇలాంటి విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ గెటప్ శ్రీను ఆరోపించాడు. చిరంజీవి గారి యొక్క సేవాగుణం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఆయన యొక్క ఛారిటీ ఒక తెరిచిన పుస్తకం వంటిది.
చిరంజీవి గారు ఒక స్ఫూర్తి ప్రధాత, ఇప్పుడు మీకు ఎందుకు ఆయన గురించి మంచి కనిపించడం లేదో ఒక సారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉనికి కోసం ఆయన్ను విమర్శిస్తే ప్రజల్లో మీరు చులకన అవుతారు.. అలాగే జనాల్లో మీపై ఉన్న గౌరవం తగ్గుతుందని అన్నాడు.
మీ నోటి నుండి ఇలాంటి పచ్చి అబద్దాలు వస్తాయని నేను ఎప్పుడు ఊహించలేదు. దయచేసి మీ యొక్క వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి అంటూ గెటప్ శ్రీను విజ్ఞప్తి చేశాడు. ఫేస్ బుక్ లో గెటప్ శ్రీను షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే ఆ పోస్ట్ ను గెటప్ శ్రీను వెంటనే తొలగించడం తో మెగా ఫ్యాన్స్ ఆయన తీరును తప్పుబడుతున్నారు.