Geethika : కొత్త అందం గీతిక.! తేజ హీరోయిన్ అంటే ఆ మాత్రం హాట్‌నెస్ వుండాలా.!
NQ Staff - October 18, 2022 / 07:33 PM IST

Geethika : టాలీవుడ్‌లో ఈ మధ్య కొత్త అందాలకు క్రేజ్ ఎక్కువవుతోంది. రీసెంట్‌గా పరిచయమైన మృణాల్ ఠాకూర్ తదితర ముద్దుగుమ్మలు బాగానే సత్తా చాటుతున్నారు.

Geethika Latest Cute Saree Photos
ఆ కోవలోకే మరో కొత్త భామ దిగుమతి కాబోతోంది. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి క్రియేటివ్ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ ముద్దుగుమ్మని దించుతున్నాడు తేజ. పేరు గీతిక.
తేజ కంపెనీ నుంచి రానున్న కొత్త బొమ్మ.!.
కొత్త వాళ్లను పరిచయం చేయడంలో తేజ రూటే సెపరేటు. ఎందరో నటీ నటులు తేజ చేతుల మీదుగా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు గొప్ప నటీనటులుగా ఎదగడమే కాదు, కెరీర్‌లో ఎన్నో ఎత్తులు చూసినవాళ్లున్నారు. ముఖ్యంగా హీరోయిన్లలో కాజల్ అగర్వాల్.. చందమామగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతోందంటే, అది డైరెక్టర్ తేజ చలవే.!

Geethika Latest Cute Saree Photos
ఆ కోవలోనే తాజాగా గీతిక తెలుగు తెరకు పరిచయమవుతోంది. సినిమాతో సంబంధం లేకుండా, తమ తమ ఉనికిని చాటుకోవాలంటే మొదట ఎంచుకోవాల్సిన ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా.
ఆ ప్లాట్‌ఫామ్ ద్వారానే అమ్మడు తన ఐడెంటిటీని చాటుకునే ప్రయత్నం స్టార్ట్ చేసింది.
హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కాక రేపుతోంది. సినిమాలో ట్రెడిషనల్‌గానే కనిపిస్తోంది కానీ, పాపలో నెక్స్‌ట్ లెవల్ హాట్ యాంగిల్ వుందని నెట్టిల్లు ప్రూవ్ చేస్తోంది. చూడాలి మరి, తేజ హ్యాండ్ అమ్మడిపై వర్కవుట్ అవుతుందో.? లేదో.!