Gautham Karthik And Manjima Mohan : వైవాహిక బంధంతో ఒక్కటై హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమ.!
NQ Staff - November 28, 2022 / 01:59 PM IST

Gautham Karthik And Manjima Mohan : ప్రముఖ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ ఓ ఇంటివాడయ్యాడు. తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్గా నటించిన మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ గుర్తుందా.? ఆమెనే పెళ్ళాడాడు గౌతమ్ కార్తీక్.

Gautham Karthik And Manjima Mohan Married In Love
గత కొంతకాలంగా గౌతమ్ కార్తీక్, మంజిమ మోహన్ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తొలుత స్నేహం, ఆ తర్వాత ప్రేమ.. చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్ళిపీటలెక్కారు గౌతమ్ కార్తీక్, మంజిమ మోహన్.
మణిరత్నం ‘కడలి’లో నటించిన గౌతమ్ కార్తీక్..

Gautham Karthik And Manjima Mohan Married In Love
గౌతమ్ కార్తీక్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో సీనియర్ నటి రాధ చిన్న కుమార్తె హీరోయిన్గా నటించింది.
అన్నట్టు మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నటించిన ఓ తమిళ సినిమాలోనూ గౌతమ్ కార్తీక్ హీరోగా నటించాడు. ఇక, మంజిమ పలు మలయాళ సినిమాల్లో నటించింది.

Gautham Karthik And Manjima Mohan Married In Love
కొన్నాళ్ళ క్రితం కాలికి గాయం కావడంతో ఆమె సినిమాలకు కొంత దూరమయ్యింది. ఆ ప్రమాదం వల్లే అనూహ్యంగా బరువు పెరిగిందామె. ఆ సమయంలో గౌతమ్ కార్తీక్ ఆమెకు అండగా నిలిచాడు.
కొత్త జంట గౌతమ్ కార్తీక్ – మంజిమ మోహన్‌కి పలువురు సినీ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు.