Gautham Karthik : హీరో హీరోయిన్ పెళ్లి ముహూర్తం ఖరారు.. సందడి లేదేం?
NQ Staff - November 14, 2022 / 12:25 PM IST

Gautham Karthik : తమిళ సినియర్ స్టార్ కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ మరియు హీరోయిన్ మంజుమా మోహన్ గత కొంత కాలంగా ప్రేమ లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా తాము ప్రేమలో ఉన్నామంటూ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అంతే కాకుండా వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. గౌతమ్ కార్తీక్ ఈ మధ్య కాలం లోనే హీరో గా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.
ఆయన కోలీవుడ్ లో తప్పకుండా మంచి నటుడిగా పేరు దక్కించుకుంటాడనే నమ్మకాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. హీరోగా మెల్ల మెల్లగా అడుగులు వేస్తున్న ఈ సమయం లో అనూహ్యంగా పెళ్లి చేసుకోవడంతో కెరియర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు హీరోయిన్ గా మంజిమా మోహన్ గతంలో నాగ చైతన్య కు జోడి గా సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం లో నటించింది. ఆ సినిమా తర్వాత తెలుగు లో పెద్దగా ఆఫర్స్ దక్కలేదు. కానీ ఇతర భాషల్లో ఈ అమ్మడి యొక్క జర్నీ కొనసాగుతోంది.
ఈ సమయంలో హీరోయిన్ గా అవకాశాలు కోసం ప్రయత్నించకుండా పెళ్లి చేసుకోవడంతో కెరియర్ పై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి పెళ్లి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
నవంబర్ 28వ తారీఖున చెన్నైలోని ప్రముఖ కల్యాణ వేదికలో కోలీవుడ్ ప్రముఖుల సమక్షంలో వివాహం జరగబోతుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ పెళ్లి ముహూర్తం అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే వీరి పెళ్లి సందడి మొదలు అయినట్లుగా కనిపించడం లేదు.