Viral Video : వీడియో : సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడి స్టేజ్ షో
NQ Staff - December 1, 2022 / 04:56 PM IST

Viral Video : సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు చిన్న వయసులోనే తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. స్కూల్ హాలిడేస్ సమయం లో మహేష్ బాబు ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాల్లో అయినా నటించేవాడు.
మహేష్ బాబు చిన్నప్పటి నుండి కూడా సినిమాల్లో నటిస్తూ ఉండడం వల్ల హీరోగా పరిచయమైన తక్కువ కాలానికే సూపర్ స్టార్ గా మంచి పేరును దక్కించుకున్నాడు. హీరో గా మహేష్ బాబు సొంతం చేసుకున్న ఇమేజ్ ఆయన తనయుడు సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఎప్పుడెప్పుడు నటుడిగా తెరంగేట్రం చేస్తాడు అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ ఒక సినిమాలో నటించాడు.
తాజాగా తన హై స్కూల్ లో జరిగిన స్టేజ్ ప్రోగ్రాంలో గౌతమ్ పాటిస్పేట్ చేశాడు. గౌతం యాక్టింగ్ వీడియోలను నమ్రత తో పాటు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం గౌతమ్ కృష్ణ యొక్క యాక్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని మీరు ఒక లుక్ వేయండి.
#GautamGhattamaneni from his high school play 🤩#NamrataShirodkar shared via Instagram
https://t.co/Ouw4YgwgQr@urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/48gY85ecgA— BA Raju's Team (@baraju_SuperHit) December 1, 2022