Garikapati Narasimha Rao And Megastar Chiranjeevi : చిరంజీవిది సంస్కారం.! గరికపాటిది అహంకారం.!
NQ Staff - October 7, 2022 / 02:32 PM IST

Garikapati Narasimha Rao And Megastar Chiranjeevi: ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు నేరుగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశారు. పూర్వాశ్రమంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు పట్ల విపరీతమైన అభిమానం వుండడం వల్ల, ఆ అభిమానాన్ని ఇతర హీరోలపై దురభిమానం ప్రదర్శించేలా కుత్సిత బుద్ధిని ప్రదర్శించే గరికపాటి నుంచి ‘ఏపాటి’ సంస్కారాన్ని ఆశించగలం చిరంజీవి విషయంలో.?
కానీ, చిరంజీవి హుందాతనమే ప్రదర్శించారు. చిరంజీవి అంటేనే హుందాతనం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, తన అన్న పట్ల గరికపాటి ప్రదర్శించిన పైత్యాన్ని తమ్ముడిగా నాగబాబు ఖండించాలి కదా.? ఆయనా నేరుగా గరికపాటి పేరు ప్రస్తావించడం ఇష్టం లేకనే, పరోక్షంగా మండిపడ్డారు.
అభిమానులు ఆపుకోలేరు కదా.?
అసందర్భ ప్రేలాపనతో తమ అభిమాన హీరోని టార్గెట్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా.? బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అలాగే ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా చిరంజీవి ఎన్నో వేల, లక్షల ప్రాణాల్ని నిలబెట్టారు మరి. అలా నిలబడ్డ ప్రాణాల్లో కొన్నయినా చిరంజీవి తరఫున గొంతు విప్పుతాయ్ కదా.? గట్టిగా అవతలి వ్యక్తుల్ని కడిగి పారేస్తాయ్ కదా.?
కేవలం చిరంజీవిని టార్గెట్ చేయడానికే గరికపాటి ‘లేచి వెళ్ళిపోతా’ అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో బ్రాహ్మణ సంఘాలకు సంబంధమేంటి.? అవెందుకు చిరంజీవి మీద మండి పడతాయ్.? ఏం, కాపు సంఘాలు లేవా.? చిరంజీవికి మద్దతుగా కాపు సంఘాలు ఏకతాటిపైకి వస్తే పరిస్థితి ఏంటి.?
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? ఓ వ్యక్తి అంఖారం, ఇంకో వ్యక్తి సంస్కారం.. ఇదీ అసలు విషయం. కుసంస్కారి మీద మాటల తూటాలు పేలతాయ్. అలాంటోళ్ళకి కులమూ వుండదు, మతమూ వుండదు. ఓ అహంకారి, కుసంస్కారిది ఫలానా కులం అని ఏదన్నా కులం చెప్పుకోగలుగుతుందా.?