Chiranjeevi : చిరంజీవిపై గరికపాటి సీరియస్.! సీన్‌లోకి ఎంటరై సెటైర్లేసిన నాగబాబు.!

NQ Staff - October 7, 2022 / 08:50 AM IST

Chiranjeevi : చిరంజీవిపై గరికపాటి సీరియస్.! సీన్‌లోకి ఎంటరై సెటైర్లేసిన నాగబాబు.!

Chiranjeevi : ఫాఫం గరికపాటి.! మెగాస్టార్ చిరంజీవిని చూసి అక్కసు వెల్లగక్కుకుని, చీవాట్లు తింటున్నాడు. కటకటా.! ఎంత కష్టమొచ్చింది గరికపాటికి.! గరికపాటి ప్రవచనాలకి బోల్డంతమంది ఫాలోవర్స్ వున్నారు. గరికపాటిని ఘనాపాటి.. అంటుంటారు చాలామంది.

కానీ, నాగబాబు మాత్రం ‘ఏపాటివాడికైనా’ అంటూ గరికపాటిని ‘గడ్డిపోచలా’ పీకి అవతల పారేశారు సోషల్ మీడియా వేదికగా. ‘ఏపాటివాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే..’ అంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ వేశారు.

గరికపాటి నెత్తిన గ్రహాలు వికృత తాండవం చేశాయా.?

చిరంజీవి చుట్టూ జనం మూగడం అనేది సర్వసాధారణమైన విషయం. చిరంజీవికి వున్న స్టార్‌డమ్ అలాంటిది. ఆమాత్రం తట్టుకోలేకపోతే ఎలా గరికపాటీ.? అంటూ సోషల్ మీడియా వేదికగా గరికపాటిని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.

మంచి మాటలు చెప్పడం ద్వారా గరికపాటి చాలామందికి ఆప్తుడయ్యారు. ఇప్పుడు వాళ్ళలోనే చాలామంది, ‘మంచి మాటలు చెప్పడానికే తప్ప, ఆచరించడానికి పనికిరావా.? గొప్ప వ్యక్తుల్ని చూసి అసహనంతో అక్కసు వెల్లగక్కే నువ్వు ఎలా ఘనాపాటివయ్యావ్.’ అనే ప్రశ్నలు గరికపాటి మీదకు దూసుకొస్తున్నాయ్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us