Galla Ashok : నాని మూవీలో అశోక్ గల్లా.. సినిమాపై ఆస‌క్తి ఎలా వ‌చ్చిందో చెప్పిన హీరో

Galla Ashok : ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతోన్నాడు. మహేష్ సోదరి పద్మావతి కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. గల్లా జయదేవ్ తన కొడుకు కోసం అమర్ రాజా మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి కొడుకును హీరో సినిమాతో హీరోగా లాంచ్ చేయబోతోన్నారు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది.

Galla Ashok in mahesh babu Nani Movie
Galla Ashok in mahesh babu Nani Movie

హీరో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేయించారు. మొదటి చిత్రమే అయినా ఇందులో అశోక్ అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించినట్టు కనిపిస్తోంది. ఇందులో శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా జానర్లను ఇందులో మిళితం చేసినట్టున్నారు.

ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మీడియాతో ముచ్చటించారు. ఎక్కువగా చిరంజీవి గారి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు. కథ గురించి ఇప్పుడే నేను ఎక్కువగా చెప్పలేను కాని ట్విస్ట్‌లోనే ఈ సినిమా టైటిల్‌కు జస్టిఫికేషన్ ఉంటుంది అని తెలిపారు.

తాత‌య్య కృష్ణ, మహేష్ బాబు గారి లెగసీని కంటిన్యూ చేద్దామనే. డ్యాన్స్, యాక్షన్‌లోట్రైనింగ్ తీసుకున్నాను. నాకు మామూలుగా అయితే యాక్టింగ్ అంటేనే ఇష్టం. నేనేమీ నాచురల్ డ్యాన్సర్‌ని కాదు. జిమ్‌కు వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. కానీ నాకున్న లెగసీ కోసమే ఇవన్నీ నేర్చుకున్నాను. నాకు ఏడు ఎనిమిదేళ్లున్న సమయంలోనే తాతగారు ఓ సినిమాలో పెట్టారు. నాని సినిమాలో కూడా నటించాను.

అప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. సింగపూర్‌లో థియేటర్ క్లాస్‌లు చేస్తుంటే అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా సినిమా ఫైనల్ కాపీ రాలేదు. వచ్చాక కృష్ణ గారు, మహేష్ బాబు గారు చూస్తారు. నాకు చిన్నప్పటి నుంచి బ్యాట్ మాన్ అంటే ఇష్టం అని అశోక్ గ‌ల్లా తెలియ‌జేశాడు.