Covid 19 : గుడ్ న్యూస్.. క‌రోనా సోకిన వారికి ఫ్రీగా ఫుడ్ డెలివ‌రీ

Covid 19 : క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి బుస‌లు కొడుతుంది. మొన్న‌టి వ‌ర‌కు ప‌దివేలు కేసులు ఉండ‌గా, ఇప్పుడు రెండు ల‌క్ష‌ల‌కు చేరువైంది. మరోవైపు ఒమిక్రాన్ భయాలు కూడా నానాటికీ పెరుగుతూనే వస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి.

food free delivery for Covid patient
food free delivery for Covid patient

బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. ముందు రోజు కంటే ఇవి 50 వేలు అధికం. సెకెండ్ వేవ్‌లో గతేడాది మే 26 తర్వాత రోజువారీ కేసులు 2 లక్షలు దాటడం ఇదే మొదటిసారి. గురువారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 2.47 లక్షల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది.

మూడు వారాల కిందట లక్షలోపు ఉన్న యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం 11 లక్షలకు చేరుకున్నాయి. కోలుకున్నవారి కంటే కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, మరణాలు కూడా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ మరణాలు మరోసారి 400 దాటాయి.

డిసెంబరు 28 నుంచి రోజువారీ కేసులు రెట్టింపు వేగంతో పెరుగుతుండటం దేశంలో కరోనా ఉద్ధృతికి అద్దం పడుతోంది. ఒక్క సోమవారం తప్పితే 15 రోజులుగా పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. మంగళవారంతో పోల్చితే బుధవారం రోజువారీ కేసులు 26 శాతం అధికంగా నమోదయ్యాయి.

కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో కోవిడ్ 19 సోకిన వారికి ఇప్పుడు ఇంటి వద్దకే ఉచితంగానే ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు కేవలం కోల్‌కతాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక యాప్ ఈ సేవలు అందిస్తోంది. ఫూజా అనే ఫుడ్ డెలివరీ యాప్ ఇలాంటి సర్వీసులు ఆఫర్ చేస్తోంది. పలు రెస్టారెంట్లు, హోమ్ చెఫ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా యాప్ ఈ సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం ఈ సేవలు దక్షిణ కోల్‌కతా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఇంటి వద్దకే ఆహారాన్ని అందిస్తోంది. ఫూజా సీఈవో, కోఫౌండర్ కపిల్ లోహియా మాట్లాడుతూ.. ‘ఫుడ్ పార్ట్‌నర్స్‌కు, లోకల్ చెఫ్‌లకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కోవిడ్ 19తో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయడం ఆనందంగా ఉంది’ అని వివరించారు.