RC15 Movie : బ్రేకింగ్ : ఆర్‌సీ15 టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
NQ Staff - March 8, 2023 / 04:02 PM IST

RC15 Movie : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ మీడియా సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమా కు సీఈవో అనే టైటిల్ ని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
సినిమాకు సంబంధించిన పిఆర్‌టీం నుండి మీడియాకు లీక్ అందినట్లుగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రలో అంజలి నటిస్తోంది.
భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఉగాదికి సినిమా యొక్క ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్ తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
కొన్ని పీరియాడిక్ సన్నివేశాలు సినిమా కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ముఖ్యంగా తండ్రి పాత్రకు చెందిన రామ్ చరణ్ లుక్ ఆకట్టుకుంటుందని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ మెగా అభిమానులు ధీమాతో ఉన్నారు.