Filmfare Awards : ఫిలిం ఫేర్ 2021 : క్లీన్ స్వీప్ చేసేసిన ‘పుష్ప ది రైజ్’.!

NQ Staff - October 7, 2022 / 10:11 PM IST

Filmfare Awards : ఫిలిం ఫేర్ 2021 : క్లీన్ స్వీప్ చేసేసిన ‘పుష్ప ది రైజ్’.!

Filmfare Awards : దేశంలో అత్యున్నత సినీ పురస్కారాలకు సంబంధించి ప్రైవేటు విభాగంలో ఫిలిం ఫేర్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని చెప్పొచ్చు. అయితే, ఈ పురస్కారాల విషయమై కొన్ని ఆరోపణలూ లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.

అసలు విషయానికొస్తే, 2021 సంవత్సరానికి సంబంధించి ఫిలింఫేర్ పురస్కరాల వేడుక అక్టోబర్ 9న జరగనుంది. ఈ పురస్కారాలకు సంబంధించి ‘పుష్ప ది రైజ్’ క్లీన్ స్వీప్ చేసినట్లే తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతున్న ‘పుష్ప’ మేనియా…

సినిమా విడుదలై చాలా నెలలే అయినా, ఏదో ఒక రూపంలో ‘పుష్ప’ మేనియా దేశవ్యాప్తంగా ఇంకా కనిపిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో ఫిలిం ఫేర్ పురస్కారాలు కూడా ‘పుష్ప ది రైజ్’నే వరించాయట. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు.. ఇలా పలు విభాగాల్లో ‘పుష్ప ది రైజ్’ చాలా అవార్డుల్ని క్లీన్ స్వీప్ చేసినట్లు తెలుస్తోంది.

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా బుచ్చిబాబు సన ‘ఉప్పెన’ చిత్రానికిగాను (ఈయనా సుకుమార్ దర్శకుడే కావడం గమనార్హం) అందుకోనున్నాడు. రష్మిక విషయమై కొంత సస్పెన్స్ కొనసాగుతోంది ఉత్తమ నటి పురస్కారానికి సంబంధించి. కాగా, 2021లో పెద్ద విజయం సాధించిన ‘అఖండ’ సినిమాకి

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us