Pawan Kalyan : ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ : పవన్ కళ్యాణ్‌కి వైఎస్ జగన్ ‘వరం’.!
NQ Staff - August 26, 2022 / 10:04 PM IST

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేసినా, అది అనూహ్యంగా జనసేన పార్టీకి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చుతోంది. ఇది కాస్త ఆసక్తికరమైన విషయమే మరి.!

Fight between Pawan Kalyan and YS Jagan
కొన్నాళ్ళ క్రితం ‘భీమ్లానాయక్’ సినిమాకి టిక్కెట్ల ధరల విషయమై ఏపీ సర్కారు వ్యవహరించిన తీరు అందరికీ గుర్తుండే వుంటుంది. అప్పట్లో, పవన్ అభిమానులు.. తగ్గింపు ధరలకే సినిమా చూశారుగానీ, తాము సినిమా కోసం పెట్టాలనుకున్న ఖర్చుని మాత్రం జనసేన పార్టీకి విరాళంగా పంపించేశారు. దాన్నొక ఉద్యమంగా భావించారు పవన్ అభిమానులు.
ఈసారి ఫ్లెక్సీల వంతు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) నేపథ్యంలో ఏర్పాటు చేయబోకే ఫ్లెక్సీలను నిలువరించడానికే.. అని జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.
భావించడమే కాదు, ‘ఫ్లెక్సీలు పెడితే, వారం రోజులకో పది రోజులకో చిరిగిపోతాయ్.. ఖర్చు దండగ.. ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వండి.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కౌలు రైతుల కుటుంబాలకు అది సాయపడుతుంది..’ అంటూ జనసేన నేతలు, జనసైనికులు క్యాంపెయిన్ మొదలు పెట్టారు.
ఇదీ ఇన్నోవేటివ్ ఐడియా అంటే.! ‘నువ్వు రాళ్ళు విసిరితే, వాటిని నేను దాచుకుని ఓ పెద్ద కోటను కట్టుకుంటాను..’ అని ఇంగ్లీషులో ఓ సేయింగ్ వుంది. అలా వుందిప్పుడు పరిస్థితి.