Nithya Menon And Trivikram Srinivas : నిత్యామీన‌న్‌కి త్రివిక్ర‌మ్ మీద అంత కోపం ఉందా.. అందుకే ఆ సాంగ్‌లో కూడా న‌టించ‌లేదా?

NQ Staff - August 3, 2022 / 12:02 PM IST

Nithya Menon And Trivikram Srinivas  : నిత్యామీన‌న్‌కి త్రివిక్ర‌మ్ మీద అంత కోపం ఉందా.. అందుకే ఆ సాంగ్‌లో కూడా న‌టించ‌లేదా?

Nithya Menon And Trivikram Srinivas  : మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో టాలెంటెడ్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు వ‌రుస హిట్స్‌తో దూసుకుపోయింది. కాని మ‌ధ్య‌లో నిత్యాని వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిచండంతో స్పీడ్ త‌గ్గింది. అయితే భాష ఏదైనా తనకి నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేదంటే లేదు.

అలా చేసిందా?

ఎంత భారీ రెమ్యునరేషన్ ఇస్తామని మేకర్స్ ఆఫర్ చేసినా కూడా డబ్బు కోసం మనసు చంపుకొని సినిమాను ఒప్పుకోదు. త‌న పాత్రను కథ చెప్పినప్పుడు ఒకలా..షూటింగ్ సమయంలో ఒకలా చేస్తే గొడవ పడటానికైనా రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో ఓ టాక్ ఉంది. గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సమంత హీరోయిన్‌గా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సమయంలో ఇలాంటి సందర్భమే ఎదురైందని అప్పట్లో ప్రచారం జరిగింది.

 Fight Between Nithya Menon And Trivikram Srinivas

Fight Between Nithya Menon And Trivikram Srinivas

త్రివిక్ర‌మ్‌ కథ చెప్పినప్పుడు తన పాత్రను ఒకలా చెప్పి ఆ తర్వాత మార్చేసి సీన్స్ షూట్ చేయబోయారట. అది సహించని నిత్యా గురూజీని వారించి మరీ ముందు చెప్పినట్టుగా సీన్స్ చేయించిందట. భీమ్లా నాయ‌క్ సినిమా స‌మ‌యంలోను ఇలానే జ‌రిగింద‌ట‌. ఈ క్ర‌మంలో అంత ఇష్టం ఏందయ్యా అనే పాటను రికార్డ్ చేసి కూడా షూట్ చేయలేదట.

చిత్ర గారితో నిత్య మీనన్ – పవన్ కళ్యాణ్‌ల మధ్య సాంగ్ బాగానే ప్లాన్ చేశారు. దీని ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించారు. కానీ షూటింగ్ సమయంలో నిత్య – గురూజీల మధ్య గొడవ జరిగిందట. ఆ కోపంతోనే కావాలనే సినిమాలో పాటకు ప్రాధాన్యం ఉన్నా నిత్య మీద ఆ పాటను చిత్రీకరించలేదట. ఇది చిత్ర యూనిట్ అందరికీ తెలుసునని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us