Itlu Maredumilli Prajaneekam : స్ట్రెయిట్ సినిమా వద్దు.! డబ్బింగ్ సినిమానే ముద్దు.!
NQ Staff - November 25, 2022 / 10:32 AM IST

Itlu Maredumilli Prajaneekam : ‘లవ్ టుడే’ అనే ఓ సినిమా తెలుగులో విడుదలవుతోంది. విడుదలవుతున్న సినిమాల్లో ఈ సినిమాకే అత్యధిక థియేటర్లు దక్కుతున్నాయ్. అన్నట్టు, స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కూడా విడుదలవుతోంది. అల్లరి నరేష్ హీరోగా నటించాడు ఈ సినిమాలో.
నిజానికి, అల్లరి నరేష్ స్టామినా వున్న హీరోనే టాలీవుడ్‌లో. కానీ, తక్కువ థియేటర్లే దొరికాయ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాకి. ప్రమోషన్ల విషయంలో ఈ సినిమా కాస్త వెనకబడిన మాట వాస్తవం. కానీ, ‘లవ్ టుడే’కి పెద్దగా ప్రమోషన్లు కూడా లేవు.
ఇదేం జాడ్యం.?
స్ట్రెయిట్ తెలుగు సినిమాలకి థియేటర్లు తగ్గించేసి, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఎక్కువ ఇవ్వడమేంటి.? ఇదేం జాడ్యం.? అన్న చర్చ తెలుగు సినీ వర్గాల్లోనే కాదు, సగటు సినీ అభిమానుల్లోనూ జరుగుతోంది.

Few Theaters Found For Movie Itlu Maredumilli Prajaneekam
తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాపితమైందని గర్వపడుతూనే, తెలుగు సినిమాని ఇలా చంపేసుకుంటున్నామన్నమాట. అన్నట్టు, సంక్రాంతికి రెండు పెద్ద సినిమాల్ని కాదని, డబ్బింగ్ సినిమా ‘వారసుడు’కి మేగ్జిమమ్ థియేటర్లను కేటాయించనున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి లాంటోళ్ళు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచితే.. కొందరు తెలుగు సినిమాని చంపేయాలని చూస్తున్నారన్నమాట.