Faria Abdullah : సూపర్‌ స్టార్‌ సినిమాలో జాతిరత్నం… ఎట్టకేలకు ఓ మంచి ఛాన్స్‌

NQ Staff - September 27, 2022 / 05:43 PM IST

Faria Abdullah : సూపర్‌ స్టార్‌ సినిమాలో జాతిరత్నం… ఎట్టకేలకు ఓ మంచి ఛాన్స్‌

Faria Abdullah : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న SSMB28 సినిమా కోసం సూపర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ గత సినిమాలు మరియు మహేష్ బాబు గత సినిమాలు సక్సెస్ ని దక్కించుకున్నాయి. కనుక సక్సెస్ జోష్ లో ఉన్న వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె సినిమా యొక్క పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న కూడా అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఈ సినిమాలో కూడా మరో హీరోయిన్ ఉండబోతుంది.

ఈ సినిమాలో ఆ రెండవ హీరోయిన్ ఎవరా అంటూ జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెట్టినట్లే కనిపిస్తోంది. జాతి రత్నాలు సినిమాతో సక్సెస్ దక్కించుకున్న ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా కనిపించబోతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈమె ఎంపిక పూర్తి అయిందని, సినిమాలోని అత్యంత కీలక పాత్రలో ఈమె కనిపించబోతుందని మహేష్ బాబు మరియు ఈమె కాంబినేషన్ లో ఉండే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

ఇటీవల మొదటి షెడ్యూల్‌ పూర్తి అవ్వగా.. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. 2023వ సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us