Extra Jabardasth : జబర్ధస్త్‌కి రీఎంట్రీ ఇచ్చిన గెటప్ శ్రీను.. వివాదం సద్దుమణిగినట్టేనా?
NQ Staff - July 24, 2022 / 06:37 PM IST

Extra Jabardasth : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ఇటీవల ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు కారణాల వలన సుధీర్, గెటప్ శీను, అనసూయలు బయటకు వచ్చేశారంటూ ఏవేవో చెప్పుకొచ్చారు. అయితే గెటప్ శీను ఇక జబర్ధస్త్ స్టేజ్‌పై కనిపించడని అందరు భావిస్తున్న క్రమంలో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి అందరి ముఖంలో ఆనందం నింపాడు.
గెటప్ శీను రీఎంట్రీ..
లేటెస్ట్‌గా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోను ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చేస్తున్న సమయంలో స్టేజ్‌పైకి వెనుక నుంచి వచ్చాడు గెటప్ శ్రీను. రామ్ ప్రసాద్ డైలాగ్స్ చెబుతున్న సమయంలో సడెన్‌గా సర్‌ప్రైజ్ తన ఫ్రెండ్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. అనుకోకుండా స్నేహితుడు రావడంతో ఆటో రామ్ ప్రసాద్ షాక్ గురై.. తెగ సంబరపడిపోయాడు. వెంటనే తాను చేస్తున్న స్కిట్‌ను ఆపేశాడు. శ్రీనును హాగ్ చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు.

Extra Jabardasth Latest Promo
‘మేడం.. శ్రీను వచ్చాడు.. స్కిట్ చేద్దామని అనుకుంటున్నాం.. మీరు కాస్త టైమ్ ఇవ్వండి..’ అంటూ ఆటో రామ్ ప్రసాద్ జడ్జి ఇంద్రజను కోరాడు. ‘ముందు ఈ స్కిట్ ప్యాక్ చేసేసి.. వెళ్లిపోయి మా శ్రీనును తీసుకొచ్చేయండి..’ అని ఇంద్రజ చాలా హ్యాపీగా చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మై ఫ్రెండ్ అంటూ సాగే సాంగ్‌ను వేసి ఎమోషనల్‌గా టచ్ చేశారు నిర్వాహకులు.

Extra Jabardasth Latest Promo
ప్రోమోలోఅరుంధతి స్ఫూఫ్ స్కిట్ ఆకట్టుకుంది. ‘నేను షియాజీ షిండే వాళ్ల తమ్ముడు ప్రవీణ్ ముండే..’ అంటూ ప్రవీణ్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయించింది. ఆ తరువాత గెటప్ శ్రీను కమ్ బ్యాక్ స్కిట్ సూపర్‌గా ఉంది. ముఖ్యంగా శ్రీను, సీనియర్ అన్నపూర్ణ మధ్య వచ్చే సీన్స్ ఓ రేంజ్‌లో నవ్వులు పూయించాయి. మా వాడు కమల్ హాసన్‌లా చేస్తాడంటే.. ‘మీ వాడు కమల్ హాసన్‌లా చేస్తే.. కమల్ హాసన్ ఏం చేస్తాడు.. బఠానీలు తింటూ కుర్చుంటాడా..’ అంటూ అన్నపూర్ణ చెప్పిన డైలాగ్ చాలా బాగా పేలింది.