Suchendra Prasad : ప‌విత్ర నా భార్యే, కాని… అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సుచేంద్ర‌

NQ Staff - July 12, 2022 / 06:20 PM IST

Suchendra Prasad : ప‌విత్ర నా భార్యే, కాని… అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సుచేంద్ర‌

Suchendra Prasad : ప‌విత్ర లోకేష్.. ఈ అమ్మ‌డి పేరు కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో మారుమోగుతోంది. కార‌ణం.. ఈమె న‌టుడు న‌రేశ్‌తో స‌హ‌జీవ‌నం చేయ‌డ‌మే. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే వీటిపై స్పందించిన న‌రేశ్‌, ప‌విత్ర ఇద్ద‌రూ కూడా తాము పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని, కేవ‌లం స‌హ‌జీవ‌నం చేస్తున్నామ‌ని తెలిపారు.

స‌ర్టిఫికెట్ లేదు..

అయితే కొద్ది రోజులుగా న‌రేష్‌- ప‌విత్ర‌ల‌కు సంబంధించి జ‌రుగుతున్న‌ వ్యవహారాలపై పవిత్ర లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తమది ప్రేమపెళ్లి అని వెల్లడించారు. అయితే, ఉద్దేశపూర్వకంగానే మ్యారేజి సర్టిఫికెట్ తీసుకోలేదని తెలిపారు. మ్యారేజి సర్టిఫికెట్ విదేశీ విధానం అని, అందుకు తాము వ్యతిరేకం అని వివరించారు. కానీ, ఆధార్ కార్డు, పాస్ పోర్టును పరిశీలిస్తే పవిత్ర తన భార్యే అని స్పష్టమవుతుందని వివరించారు.

Ex husband Suchendra Prasad Spoke on Pavitra Lokesh

Ex husband Suchendra Prasad Spoke on Pavitra Lokesh

తామిద్దరం భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు హాజరయ్యామని కూడా సుచేంద్ర చెప్పారు. “నేను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పవిత్ర లోకేష్ భర్తను నేను.. ఆమె పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు చూస్తే మీకే తెలుస్తుంది. నా పాస్‌పోర్ట్ కూడా ఆమెను నా భార్యగా చూపిస్తుంది. మేమిద్దరం భార్యాభర్తలమవ్వడంతో చాలా మంది మత గురువులు మమ్మల్ని గౌరవించారు.

మేం కూడా భార్యాభర్తలుగా కలిసి చాలా కార్యక్రమాలకు వెళ్లాం. ఇంతకు మించిన రుజువు అవసరం లేదు. అయితే వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మాత్రమే తయారు చేయలేదని” అన్నారు. భారతదేశంలో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదని, ఇది విదేశీ సంస్కృతి అని అన్నారు. మన దేశంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానందున తాను మౌనంగా ఉన్నానని, ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేయడం నాకు చాలా తేలికని సుచేంద్ర ప్రసాద్ అన్నారు.

Ex husband Suchendra Prasad Spoke on Pavitra Lokesh

Ex husband Suchendra Prasad Spoke on Pavitra Lokesh

ఇంకోవైపు… తను సుచేంద్రను పెళ్లాడలేదని పవిత్రా లోకేష్ చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పవిత్రా లోకేష్-నరేష్ విష‌యం కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us