ETV Dhee 14 : సుధీర్, ర‌ష్మీ లేని లోలు ఢీ షోపై బాగానే ప‌డిందిగా…!

ETV Dhee 14 : బుల్లితెర‌పై ఫేమ‌స్ జంట‌ల‌లో సుధీర్, ర‌ష్మీ జంట త‌ప్ప‌క ఉంటుంది. ఈ ఇద్ద‌రికి సంబంధించి నిత్యం తెగ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి. వీరి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌నుకున్న మ‌ల్లెమాల ఏకంగా రీల్ పెళ్లి కూడా చేసింది. ఇలా ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు వాడుకున్నారు. ఇక ఢీ షోలోను ఈ జంట చేసిన ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఇద్ద‌రు క‌లిసి మంచి వినోదం పంచుతూ రేటింగ్ రాబ‌ట్టడంలో ముందున్నారు.

ETV Dhee 14 show rating loss sudigali sudheer and reshmi goutham
ETV Dhee 14 show rating loss sudigali sudheer and reshmi goutham

ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘ఢీ’ నుంచి సుడిగాలి సుధీర్, రష్మిల జంటని పక్కకి తప్పించిన విషయం తెలిసిందే. ‘ది డాన్సింగ్ ఐకాన్’ పేరుతో కొత్తగా సరికొత్తగా ప్రారంభమైన ఢీ 14 కార్యక్రమం గత బుధవారం జనవరి 12న ప్రసారం అయ్యింది. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిలను పక్కనపెట్టడంతో ఆ ప్రభావం రేటింగ్‌కి గట్టి దెబ్బ కొట్టింది.

ETV Dhee 14 show rating loss sudigali sudheer and reshmi goutham
ETV Dhee 14 show rating loss sudigali sudheer and reshmi goutham

యాంకర్ ప్రదీప్, రవికృష్ణ, బిగ్ బాస్ అఖిల్ సార్ధక్, హైపర్ ఆది, సుష్మిత, దివి ఇలా చాలామందిని బ్యాచ్‌ని రంగంలోకి దింపారు. నందిత శ్వేత, ప్రియమణి ఎన్ని పేపర్లు చింపినా పనికాలేదు.సుధీర్,ర‌ష్మీ లేకుండా రేటింగ్ పంట పండలేదు. మొన్నటి ఢీ షోకి బార్క్ రేటింగ్‌లో కేవలం 3.5 రేటింగ్ మాత్రమే వచ్చింది. బుధవారం నాడు 9.30-11 గంటలవరకూ హైదరాబాద్ కేటగిరీ బార్క్ రేటింగ్ 3.5 మాత్రమే వచ్చింది.

నిజానికి ‘ది డాన్సింగ్ ఐకాన్’ షోలో డాన్స్ పెర్ఫామెన్స్‌‌లు అదిరిపోయాయి. అయితే ఎంటర్ టైన్మెంట్‌ అందించడంలో సుధీర్, రష్మి లేని లోటు స్పష్ఠంగా కనిపించడంతో ఆ ప్రభావం రేటింగ్‌పై పడింది. దీనికి తోడు.. జడ్జీగా పూర్ణ స్థానంలో నందితా శ్వేతను తీసుకుని వచ్చారు. ఢీ షోకి సుధీర్, రష్మిలతో పాటు జడ్జీ పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్.

గ్లామర్ ట్రీట్‌తో పాటు బుగ్గకొరుకుడు యవ్వారాలతో ఢీ షోలో పూర్ణ పాపులర్ అయ్యింది ఆమెను కూడా తప్పించారు.. అయినా సుధీర్‌ ప్లేస్‌ని అఖిల్ సార్ధక్‌తో రీప్లేస్ చేయడంతో పులిహోర య‌వ్వారంలానే ఇది మారింది.మ‌రోసారి బుల్లితెరపై సుధీర్-రష్మిల మధ్య కెమిస్ట్రీ కళకట్టినట్టుగా మరేజంట మధ్య పండదని మరోసారి రుజువైంది. సుధీర్ రష్మి లేకుండా ‘ఢీ’ కొట్టడం కష్టం అని ఈ రేటింగ్‌ని బట్టి తేలిపోయింది.