Eesha Rebba : కొంటె చూపు కోణంగి.! టోపీ చాటున దాగిన ఈషా అందం అదిరిందబ్బా.!
NQ Staff - August 28, 2022 / 08:16 AM IST

Eesha Rebba : అదేంటో, తెలుగు సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలంటే ఒకింత చిన్న చూపు.! చాలాకాలంగా ఈ వాదన వినిపిస్తున్నా, తెలుగు బ్యూటీస్‌కి సరైన అవకాశాలే ఇవ్వలేకపోతున్నారు తెలుగు దర్శక నిర్మాతలు. హీరోల ఫస్ట్ ఛాయిస్ కూడా కాలేకపోతున్నారు తెలుగు భామలు. ఎందుకిలా.?

Eesha Rebba new cute photos
ముంబై ముద్దుగుమ్మలతో పోల్చినా, చెన్నయ్ చందమామలు, బెంగళూరు బ్యూటీలు, మలయాళ భామలూ.. వీళ్ళెవరికీ తీసిపోని అందం చాలామంది తెలుగు బ్యూటీస్‌లో వున్నాగానీ.. ఆయా భాషల నుంచి వస్తోన్న భామల నుంచి వస్తున్న పోటీని మన తెలుగు బ్యూటీస్ తట్టుకోలేకపోతున్నారు.
ఈషా.. అందం అదిరిందబ్బా.!
ఈషా రెబ్బా.. పదహారణాల తెలుగమ్మాయ్.. అందానికి అందం.. నటనకు నటన.. అన్నీ వున్నా, పాపం ఈషా రెబ్బాకి తెలుగులో రావాల్సిన స్టార్‌డమ్ అయితే రాలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా, అవి చిన్న సినిమాలు మాత్రమే అయ్యాయి.
ముంబై భామలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఈషా రెబ్బా సొంతం. స్టైలిష్ అందంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు.. ఇదిగో ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తున్నా.. ఇవేవీ టాలీవుడ్ దర్శక నిర్మాతల్ని కదిలించలేకపోతున్నాయ్. టోపీ ధరించి, కొంటెగా చూస్తూ.. ఈషా ఇస్తోన్న చిన్న స్మైల్.. కుర్రకారు గుండెల్లో చిన్నపాటు తుపానునే రేపుతోంది.